Bihar: ఛఠ్ పూజ వేడుకల్లో విషాదం.. ప్రసాదం చేస్తుండగా పేలిన సిలిండర్.. ఒక్క క్షణంలో..
వారందరూ పూజా కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఇష్ట దైవానికి నైవేద్యం సమర్పించుకునేందుకు ఏర్పాట్లులో నిమగ్నమయ్యారు. అందరూ కలిసి ఆనందంగా ప్రసాదం తయారు చేస్తుండగా ఊహించని దుర్ఘటన జరిగింది. వంట..
వారందరూ పూజా కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఇష్ట దైవానికి నైవేద్యం సమర్పించుకునేందుకు ఏర్పాట్లులో నిమగ్నమయ్యారు. అందరూ కలిసి ఆనందంగా ప్రసాదం తయారు చేస్తుండగా ఊహించని దుర్ఘటన జరిగింది. వంట చేస్తున్న సమయంలో ఒక్క సారిగా సిలిండర్ పేలింది. భారీగా మంటలు ఎగిసిపడి 30 మందిని గాయపరిచింది. ఈ ఘోర విషాదం బిహార్‌లోని ఔరంగాబాద్‌లో శనివారం తెల్లవారుజామున జరిగింది. వంట చేస్తున్న సమయంలో సిలిండర్ పేలి, భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఛఠ్ పూజకు సిద్ధమవుతున్న సమయంలో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఔరంగాబాద్ నగరంలోని శాహ్‌గంజ్ ప్రాంతంలో ఛఠ్ పూజ కోసం ఓ కుటుంబం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల సమయంలో ప్రసాదం తయారు చేస్తున్నారు. సూర్యోదయం లోపు ప్రసాదం తయారు చేసి దేవునికి సమర్పించాలనే హడావిడిలో వారు ఉన్నారు.
అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా సిలిండర్‌కు మంటలు అంటుకున్నాయి. భారీగా వ్యాపించాయి. ఈ ఘటనలో సిలిండర్ పేలి మంటలు వేగంగా వ్యాపించాయి. వాటిని ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ ప్రమాదంలో 30 మంది గాయాలపాలయ్యారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా.. పండుగ సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..