Cyclone Fengal: ఫెంగల్ తుఫాన్ విధ్వంసం..! గగుర్పాటు కలిగించే ఆ భయానక వీడియోలు వైరల్‌.. IMD అలర్ట్‌..!!

|

Nov 28, 2024 | 6:48 PM

ఇది నవంబర్ 30 ఉదయం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాలను కారైకాల్, మహాబలిపురం మధ్య తీరం తాకుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో గాలి వేగం గంటకు 50-60 కి.మీ నుంచి 70 కి.మీ వరకు ఉంటుందని, మత్స్యకారులు, సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చిరిస్తున్నారు.

Cyclone Fengal: ఫెంగల్ తుఫాన్ విధ్వంసం..! గగుర్పాటు కలిగించే ఆ భయానక వీడియోలు వైరల్‌.. IMD అలర్ట్‌..!!
Cyclone Fengal
Follow us on

బంగాళాఖాతంలో తీవ్ర పీడనం కారణంగా తుఫాను రాబోతోంది. దీనికి ఫెంగల్ అని పేరు పెట్టారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో అలర్ట్‌ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. ఈ తుపాను శ్రీలంకపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ.. వచ్చే 12 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని IMD తెలిపింది. ఇది నవంబర్ 30 తెల్లవారుజామున తీవ్ర అల్పపీడనంగా మారి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాలకు చేరుకుంటుంది. తీవ్ర తుఫానుగా మారడానికి ఇంకా కొంత సమయం ఉన్నప్పటికీ, ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది.

తమిళనాడులోని రామనాథపురం జిల్లా పంబన్ రేవు వద్ద బలమైన గాలులు వీస్తున్నాయి. ఇది నవంబర్ 30 ఉదయం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాలను కారైకాల్, మహాబలిపురం మధ్య తీరం తాకుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో గాలి వేగం గంటకు 50-60 కి.మీ నుంచి 70 కి.మీ వరకు ఉంటుందని, మత్స్యకారులు, సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చిరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

శ్రీలంకతో సహా భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ఫెంగల్‌ తుపాను ప్రభావాలు కనిపిస్తున్నాయి. శ్రీలంకలో తుపాను కారణంగా అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిసి వరదల పరిస్థితి ఏర్పడింది. ఇందులో నలుగురు చిన్నారులు చనిపోయారు. మరో నలుగురు గల్లంతైనట్లు శ్రీలంక రెస్క్యూ బృందాలు తెలిపాయి. ఇప్పుడు ఈ తుపాను తమిళనాడు వైపు కదులుతోంది. ఇది శక్తివంతమైన తుఫాను అయితే దాని వేగం నెమ్మదిగా ఉంటుంది.

చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు సహా తమిళనాడులోని నగరాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనితో పాటు పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లో తుపాను ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టు, పుదుకోట్టై, శివగంగై, అరియలూర్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు నవంబర్ 28 న సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.

తుపాన్‌ ప్రభావంతో నవంబర్ 29,30 తేదీల్లో ఉత్తర కోస్తా తమిళనాడు-పుదుచ్చేరిలో పలు ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 30న తమిళనాడు తీరప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.