Biparjoy Cyclone: అక్కడ దంచుతోంది..ఇక్కడ ముంచుతోంది. బిపర్‌జోయ్‌‌తో డబుల్‌ ట్రబుల్‌

|

Jun 14, 2023 | 7:08 PM

Southwest Monsoon : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలకు మోకా, బిపర్‌జోయ్‌ తుపానులు మోకాలడ్డాయి. గత నెల 9న బంగాళాఖాతంలో ‘మోకా’ తుపాను ఏర్పడింది. అది అత్యంత తీవ్ర తుపానుగా మారి బంగ్లాదేశ్‌ వైపు పయనించి తీరాన్ని దాటింది.

Biparjoy Cyclone: అక్కడ దంచుతోంది..ఇక్కడ ముంచుతోంది. బిపర్‌జోయ్‌‌తో డబుల్‌ ట్రబుల్‌
Biparjoy Cyclone
Follow us on

అక్కడ దంచుతోంది..ఇక్కడ ముంచుతోంది. బిపర్‌జోయ్‌ డబుల్‌ ట్రబుల్‌ క్రియేట్‌ చేస్తోంది. ఆ తుపాన్‌ గుజరాత్‌లో బీభత్సం సృష్టిస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోయేలా చేస్తోంది. అవును.. రుతుపవనాలు వచ్చినా మన తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడకపోవడానికి కారణం బిపర్‌జోయ్‌. నైరుతి రాకతో ఈ పాటికి తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొట్టాలి. అయితే ఎండలు ఇంకా మండిపోతున్నాయి. దీనికి కారణం ఒక్కటే. గత నెలలో వచ్చిన మోకా తుపాన్, ఇప్పుడు గుజరాత్‌లో అల్లకల్లోలం సృష్టిస్తున్న బిపర్‌జోయ్‌.

ఈ ఏడాది నైరుతి వర్షాలకు మోకా, బిపర్‌జోయ్‌ తుపానులు సంకటంగా మారాయి. గత నెల 9న బే ఆఫ్ బెంగాల్‌లొ  ‘మోకా’ సైక్లోన్ ఏర్పడింది. అది తీవ్ర రూపం దాల్చి.. మారి బంగ్లాదేశ్‌ వైపు పయనించి తీరాన్ని క్రాస్ చేసింది. దీంతో బే ఆఫ్ బెంగాల్‌లోని తేమను ఈ సైక్లోన్ అటు వైపు తీసుకువెళ్లింది. బే ఆఫ్ బెంగాల్‌లో వేగంగా విస్తరించకుండా, ఆపై కేరళలోకి సకాలంలో ఎంట్రీ ఇవ్వకుండా లేటయ్యింది. మొత్తానికి 8న మాన్ సూన్ కేరళలో ఎంటరయ్యింది. ఆ తర్వాత అరేబియా సముద్రంలో ఈనెల 6న ‘బిపర్‌జోయ్‌’ సైక్లోన్ వచ్చిపడింది. ఈ సైక్లోన్ కూడా అత్యంత తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది గుజరాత్‌ వైపు వెళ్తుంది. ఈ తుపాను కూడా ‘మోకా’ మాదిరిగానే నైరుతి రుతుపవనాల వేగానికి కళ్లెం వేసింది. అరేబియా సముద్రంలోని తేమను తుపాను ప్రభావిత ప్రాంతం వైపు తీసుకెళ్లిపోవడంతో రుతుపవనాలు ఆశించినంతగా విస్తరించడం లేదు.. వర్షించడం లేదు.

తుపాన్‌ ప్రభావంతో వర్షాల రాక ఆలస్యమై ఎండలు మండిపోతున్నాయని, మరి కొద్ది రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతుంది. బిపర్‌జోయ్‌ సైక్లోన్ కాస్త బలహీనమైతే రుతుపవనాలు వేగంగా ప్రయాణించి వర్షాలు కురుస్తాయని అంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..