AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: పెళ్లి వేడుకలో వింత ఊరేగింపు.. ఏకంగా 51 ట్రాక్టర్లతో వధువు ఇంటికి వచ్చిన వరుడు

ఒకప్పుడు 16 రోజుల పెళ్లి, 5 రోజుల పెళ్లి అంటూ జరిగేవి. కాలక్రమేనా ఇప్పుడు అది రెండు రోజులు, ఒక్కరోజుకే పరిమితమైపోయింది. ఆ మధ్య జరిగే వివాహాలను కూడా కొన్ని కుటుంబాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా గ్రాండ్‌గా జరపుకుంటున్నాయి.

Watch Video: పెళ్లి వేడుకలో వింత ఊరేగింపు.. ఏకంగా 51 ట్రాక్టర్లతో వధువు ఇంటికి వచ్చిన వరుడు
Wedding Procession
Aravind B
|

Updated on: Jun 14, 2023 | 4:58 PM

Share

ఒకప్పుడు 16 రోజుల పెళ్లి, 5 రోజుల పెళ్లి అంటూ జరిగేవి. కాలక్రమేనా ఇప్పుడు అది రెండు రోజులు, ఒక్కరోజుకే పరిమితమైపోయింది. ఆ మధ్య జరిగే వివాహాలను కూడా కొన్ని కుటుంబాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా గ్రాండ్‌గా జరపుకుంటున్నాయి. కొంచెం డబ్బున్నవాళ్లు పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్, రిసార్టులు, ప్యాలెస్‌లలో అధికంగా ఖర్చు చేసి పెళ్లి వేడుకలు నిర్వహించుకుంటున్నారు. వేడుకల్లో భాగంగా వరుడ్ని ఏనుగు లేదా గుర్రాలపై ఊరేగిస్తూ ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ రాజస్థాన్‌లోని బర్మర్ జిల్లాలో ఓ కుటుంబం మాత్రం తమ పెళ్లి వేడుకను విచిత్రంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే గుడమాలని గ్రామంలోని ప్రకాశ్ చౌదరి అనే వ్యక్తికి.. రోలీ గ్రామానికి చెందిన మమతో పెళ్లి జరిగింది. అయితే ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రోజున వరుడుతో సహా  200 మంది అతిథులు 51 ట్రాక్టర్లలో వధువు ఇంటికి వచ్చి అందర్ని ఆశ్చర్యపరిచారు. వరుడు ఉన్న ట్రాక్టర్ వెనుక మిగతా అన్ని ట్రాక్టర్లు రావడాన్ని చూసి స్థానికులు చూపు తిప్పుకోలేకపోయారు. అలాగే ముందున్న ట్రాక్టర్‌లో వరుడే వాహనాన్ని నడపడం మరో విశేషం.

అయితే ఇలా కొత్తగా పెళ్లి ఊరేగింపు చేయాలనే ఆలోచన  వరుడి తండ్రిదే. వరుడి తండ్రి జెతారాం మాట్లాడుతూ.. మా నాన్న, తాతయ్యకు అప్పట్లో పెళ్లి వేడుకల్లో భాగంగా ఒంటెలపై ఊరేగించారని.. నా పెళ్లికి ట్రాక్టర్‌పై ఊరేగించారని చెప్పారు. అందుకే నా కొడుకు కోసం 51 ట్రాక్టర్లతో ఈ ఊరేగింపును ఏర్పాటు చేశామని తెలిపారు. తన కుటుంబంలో 20 నుంచి 30 ట్రాక్టర్ల వరకు ఉన్నాయని.. అలాగే తన రైతు మిత్రుల వద్ద మరికొన్ని ఉన్నాయని చెప్పారు. ఇలా మొత్తం 51 ట్రాక్టర్లతో ఈ ఊరేగింపు చేశామన్నారు. పెళ్లికూతురు గ్రామానికి చేరుకోగానే ఒక్కసారిగా ఇన్ని ట్రాక్టర్లు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారని అన్నారు. తమ కుటుంబం ప్రధాన వృత్తి వ్యవసాయమని.. అందరూ వ్యవసాయంపైనే ఆధారపడ్డామని వరుడు ప్రకాశ్ చౌదరి తెలిపాడు. ట్రాక్టర్లతోనే మేము వ్యవసాయం చేస్తామని.. వాటిపైనే ఎందుకు ఊరేగింపు చేయకూడదని ఆలోచన రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి :

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..