కరోనా కాటు…ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ హెడ్ క్వార్టర్స్ మూసివేత

ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ ప్రధానకార్యాలయాన్ని మూసివేశారు. ఈ హెడ్ క్వార్టర్స్ లో పని చేసే ఒక డ్రైవర్ కు కరోనా పాజిటివ్ లక్షణాలు సోకడంతో ఈ కార్యాలయాన్ని సీల్ చేశారు. దీన్ని మొత్తం శానిటైజ్ చేస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు ఈ భవనంలోకి ఎవరినీ అనుమతించే ప్రసక్తే లేదని...

కరోనా కాటు...ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ హెడ్ క్వార్టర్స్ మూసివేత
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 03, 2020 | 1:19 PM

ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ ప్రధానకార్యాలయాన్ని మూసివేశారు. ఈ హెడ్ క్వార్టర్స్ లో పని చేసే ఒక డ్రైవర్ కు కరోనా పాజిటివ్ లక్షణాలు సోకడంతో ఈ కార్యాలయాన్ని సీల్ చేశారు. దీన్ని మొత్తం శానిటైజ్ చేస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు ఈ భవనంలోకి ఎవరినీ అనుమతించే ప్రసక్తే లేదని అధికారులు హెచ్చరించారు. సీఆర్పీఎఫ్ బెటాలియన్ లోని 122 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ సోకిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడి మయూర్ విహార్ ప్రాంతం మొత్తం సీల్ చేసేశారు.  మరో వంద మంది జవాన్ల టెస్ట్ ఫలితాలు తెలియాల్సి ఉంది. ఈ బెటాలియన్ లో వెయ్యి మంది జవాన్లు ఉన్నారు. ఇండియాలో కరోనా కేసులు 39 వేలకు చేరుకోగా.. 1300 మంది కరోనా రోగులు మృతి చెందారు.