Delhi High Court: భార్యతో బ‌ల‌వంత‌పు శృంగారం చేయ‌డం నేర‌మా? అలా చేస్తే శిక్ష వేస్తారా?

భార్యతో బ‌ల‌వంత‌పు శృంగారం చేయ‌డం నేర‌మా? అలా రేప్ చేస్తే శిక్ష వేస్తారా? ఈ కేసులో ఇవాళ ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువ‌రించింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విభిన్నమైన తీర్పును ఇచ్చింది.

Delhi High Court: భార్యతో బ‌ల‌వంత‌పు శృంగారం చేయ‌డం నేర‌మా? అలా చేస్తే శిక్ష వేస్తారా?
Delhi High Court
Follow us
Balaraju Goud

|

Updated on: May 11, 2022 | 3:16 PM

Delhi High Court Marital Rape: భార్యతో బ‌ల‌వంత‌పు శృంగారం చేయ‌డం నేర‌మా? అలా రేప్ చేస్తే శిక్ష వేస్తారా? ఈ కేసులో ఇవాళ ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువ‌రించింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విభిన్నమైన తీర్పును ఇచ్చింది. భార్యను బలవంతంగా మ్యారిటల్ రేప్‌పై న్యాయమూర్తులిద్దరితో కూడిన ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా జస్టిస్ రాజీవ్ శక్ధర్ అభివర్ణించారు. ఐపీసీ సెక్షన్ 375లోని 2వ మినహాయింపు రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు దీనికి జస్టిస్ సి.హరిశంకర్ ఏకీభవించలేదు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఇద్దరు న్యాయమూర్తులు తుది తీర్పు వెల్లడించారు.

వైవాహిక జీవితంలో భర్త బలవంతంగా లేదా భార్య ఇష్టానికి వ్యతిరేకంగా సంబంధం కలిగి ఉంటే, ఆమెను వైవాహిక అత్యాచారం పరిధిలోకి తీసుకురావాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ విషయంలో పిటిషనర్ వివిధ దేశాల ఉదాహరణను ఇచ్చారు. అదే సమయంలో, మహిళ గౌరవాన్ని ప్రస్తావిస్తూ, అవివాహిత మహిళతో ఆమె అనుమతి లేకుండా సంబంధం పెట్టుకోవడం నేరం కిందకు వస్తే, వివాహిత మహిళ ఎందుకు ఆ హక్కును పొందలేదని అన్నారు. ఒక‌వేళ భార్య మైన‌ర్ కాక‌పోతే, ఆమెతో జ‌రిగే శృంగారం రేప్ కాదు అని చ‌ట్టం స్పష్టం చేస్తోంది. ఈ అంశంలో గ‌తంలో ప‌లుమార్లు ఢిల్లీ కోర్టు వాద‌న‌లు జ‌రిపింది. ఆ త‌ర్వాత ఈ కేసులో ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా కోర్టు కోరింది. అయితే జ‌న‌వ‌రి 21వ తేదీన తీర్పును రిజ‌ర్వ్ చేసిన ధ‌ర్మాస‌నం ఇవాళ దాన్ని వెల్లడించింది. తీర్పులో ఏకాభిప్రాయం లేక‌పోవ‌డంతో.. ఈ కేసును సుప్రీం కోర్టుకు ట్రాన్సఫ‌ర్ చేసే అవ‌కాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇదిలావుంటే, వైవాహిక అత్యాచారాన్ని కోర్టులో నేరంగా పరిగణించే ముందు, దాని సామాజిక ప్రభావం, కుటుంబ సంబంధాలపై ప్రభావంతో సహా గ్రౌండ్ రియాలిటీని దృష్టిలో ఉంచుకుని, ఏదైనా ఉత్తర్వు ఇవ్వమని చెప్పినట్లు కేసు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది.