ఇండియాలో కోవోవాక్స్ వ్యాక్సిన్ ట్రయల్స్ , సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా వెల్లడి
ఇండియాలో కోవోవాక్స్ వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయని సీరం సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా ప్రకటించారు. నిజానికి ఇవి జూన్ నాటికి ప్రారంభమవుతాయని లోగడ ఆయన చెప్పినప్పటికీ తాజాగా ఈ ప్రకటన చేశారు.
ఇండియాలో కోవోవాక్స్ వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయని సీరం సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా ప్రకటించారు. నిజానికి ఇవి జూన్ నాటికి ప్రారంభమవుతాయని లోగడ ఆయన చెప్పినప్పటికీ తాజాగా ఈ ప్రకటన చేశారు. అమెరికన్ వ్యాక్సిన్ డెవలపర్ ‘నోవావ్యాక్స్’ తో సీరం సంస్ధ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ వ్యాక్సిన్ ని సెప్టెంబర్ లో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆదార్ పూనావాలా ట్వీట్ చేశారు. బ్రిటన్ లో నిర్వహించిన ట్రయల్స్ లో ఇది 89.3 శాతం ఎఫెక్టివ్ గా ఉన్నట్టు తేలిందని, అఫ్రికన్, యూకే వేరియంట్ల పై దీన్ని టెస్ట్ చేశారని ఆయన వెల్లడించారు.’ చివరకు ఇండియాలో కోవోవాక్స్ ట్రయల్స్ స్టార్ట్ అయ్యాయి.. కోవిడ్ 19 కి సంబంధించిన ఆఫ్రికన్, యూకే వేరియంట్లలో ఇది ఇంత శాతం నాణ్యత గలదని తేలింది’ అని ఆదార్ పూనావాలా పేర్కొన్నారు. సెప్టెంబరు నాటికీ దీన్ని లాంచ్ చేయగలమని ఆశిస్తున్నా అన్నారు. కోవోవాక్స్ సీరం సంస్థ నుంచి వెలువడుతున్న రెండో కరోనా వైరస్ వ్యాక్సిన్. ఈ కంపెనీ నుంచి ఉత్పత్తి అయిన కోవీషీల్డ్ వ్యాక్సిన్ కి ఇదివరకే డీజీసీఐ ఆమోదం తెలపగా.. అనేక దేశాలకు కూడా దీన్ని ఎగుమతి చేశారు. దేశ విదేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో ఈ వ్యాక్సిన్ అమోఘంగా తోడ్పడిందని అంటున్నారు.
గత 2 వారాల్లో దేశంలో మళ్ళీ కోవిడ్ కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో తాజాగా 62,258 కేసులు నమోదైనట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.19 కోట్లకు పెరిగింది. 1.62 లక్షలమంది మృత్యువాత పడ్డారు. ఇక మహారాష్ట్రలో తాజాగా 36,902 కేసులు నమోదైనట్టు ఈ శాఖ పేర్కొంది. మహారాష్ట్రలో మొదట కనుగొన్న డబుల్ మ్యుటెంట్ వైరస్ 18 రాష్ట్రాలకు వ్యాపించినట్టు తెలిపింది. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను యుధ్ధ ప్రాతిపదికగా చేపట్టినప్పటికీ ప్రజల నిర్లక్ష్యం కారణంగా మళ్ళీ ఈ కేసులు పెరుగుతున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
మరిన్ని ఇక్కడ చదవండి:Gram Panchayat funds మహేష్ బాబు సినిమా ఫార్ములా, మీ నిధులు…మీ ఇష్టం : ఇవాళే జీవో జారీ చేసిన కేసీఆర్ సర్కారు