Covid19 Updates: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు రోజువారీ కేసులు భారీగా పెరిగాయి. వైరస్ విజృంభిస్తుండడంతో గత 24 గంటల్లో 18,930 కొత్త కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు కూడా 1.20లక్షల చేరువకు సమీపించాయి. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా బులెటిన్ (Corona Bulletin)ను విడుదల చేసింది. ఈ గణంకాల ప్రకారం బుధవారం 4.38 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా..18,930 మందికి వైరస్ సోకినట్లు తేలింది. అంతకుముందు రోజు ఈ సంఖ్య 16వేలుగా ఉండడం గమనార్హం. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 4.35 కోట్ల మంది మహమ్మారి బారిన పడ్డారు. పాజిటివిటీ రేజు 4.32 శాతంగా నమోదైంది.
#AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive
ఇవి కూడా చదవండి????? ?????https://t.co/NvudL9gx4E pic.twitter.com/KjemfvuryU
— Ministry of Health (@MoHFW_INDIA) July 7, 2022
కొత్త కేసుల్లో ఒక్క కేరళలో నాలుగువేలకుపైగా కేసులొచ్చాయి. మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లోనూ వైరస్ విస్తరిస్తోంది. ఇక గడిచిన 24 గంటల్లో 14,650 మంది వైరస్ నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 4.29 కోట్లకు చేరుకుంది. రికవరీ రేటు 98.52 శాతంగా ఉంది. ప్రస్తుతం 1,19,457 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. క్రియాశీల రేటు 0.27 శాతానికి చేరింది. కాగా నిన్న మొత్తం 35 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఇక బుధవారం 11.4 లక్షల మంది కొవిడ్ టీకా తీసుకోగా.. మొత్తంగా 198 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..