Goa State: మీరు గోవాకు వెళ్లాలనుకుంటున్నారా..? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి..!
Goa State: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కోవిడ్ కేసులతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో గోవాకు వచ్చే ప్రయాణికు..
Goa State: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కోవిడ్ కేసులతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో గోవాకు వచ్చే ప్రయాణికులకు కీలక ఆదేశాలు జారీ చేసింది రైల్వే శాఖ. రాష్ట్రంలోకి వచ్చే వారు కోవిడ్ నెగెటివ్ రిపోర్టు తప్పనిసరి అని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. గోవాకు రావడానికి 72 గంటల ముందు ఈ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుందని తెలిపారు. అంతేకాదు బస్సులు, ఇతర వాహనాలు, వాయు విమానాల ద్వారా రాష్ట్రంలోకి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ నెగెటివ్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. కాగా,అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవాలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉంది. కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వైద్యం కోసం అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రంలోకి వచ్చేవారికి నిబంధనల నుంచి సడలింపులు ఉంటాయి. అలాంటివారు అంబులెన్స్‌లోనే వెళ్లాల్సి ఉంటుంది. లేదా పేషెంట్‌కు సంబంధించి మెడికల్ రిపోర్టులు చూపించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. మొదటివేవ్ కంటే సెకండ్‌వేవ్‌లో తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా మహమ్మారి వివిధ రకాలుగా రూపాంతరం చెందుతూ వెంటాడుతోంది.
Covid Negative Certificate for Passengers Entering Goa State.@Central_Railway pic.twitter.com/pUUpwPx6tN
— South Western Railway (@SWRRLY) May 13, 2021
ఇవీ కూడా చదవండి:
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ అంబులెన్స్‌లను తెలంగాణలోకి అనుమతి.. ఊపిరి పీల్చుకున్న రోగుల బంధువులు