AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19: మళ్లీ కోవిడ్ భయం.. ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన కేంద్ర ఆరోగ్య మంత్రి.. ఈ మార్గదర్శకాలు పాటించాలని ఆదేశం..

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఆదేశించారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజా పరిస్ధితులపై కేంద్ర ఆరోగ్య కుటుంబ..

Covid-19: మళ్లీ కోవిడ్ భయం.. ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన కేంద్ర ఆరోగ్య మంత్రి.. ఈ మార్గదర్శకాలు పాటించాలని ఆదేశం..
Union Health Minister Review
Amarnadh Daneti
|

Updated on: Dec 21, 2022 | 3:18 PM

Share

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఆదేశించారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజా పరిస్ధితులపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా బుధవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, చైనా, అమెరికా దేశాల్లో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న కారణంగా.. దేశంలో తాజా పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించారు. దేశంలో నమోదవుతున్న కేసులు, పరీక్షలు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే పరీక్షించే నమూనాల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా వైరస్ ను నియంత్రించవచ్చని సూచించారు. ఎటువంటి ఆందోళన అవసరం లేదని, ప్రజలు భయపడకుండా.. మనో ధైర్యంతో ఉండాలని కేంద్రమంత్రి సూచించారు. కొత్త వేరియంట్‌లను ట్రాక్ చేయడానికి నమూనాల సంఖ్యను పెంచడంతో పాటు.. జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పెంచాలని ఇప్పటికే కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఈ ప్రక్రియ ద్వారా దేశంలో కొత్త వేరియంట్‌లను సకాలంలో గుర్తించడంతో పాటు, అవసరమైన ప్రజారోగ్య చర్యలను చేపట్టడానికి తోడ్పతుందనే ఆలోచనలో కేంద్రప్రభుత్వం ఉంది. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్ మెంట్ తో పాటు వ్యాక్సినేషన్ అనే విధానంతో భారత్ ఇప్పటికే కోవిడ్ కేసులను నియంత్రిస్తూ వస్తోంది.

చైనా, దక్షిణ కొరియా, జపాన్ అమెరికా దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో భారత్ అప్రమత్తమైంది. ఇప్పటికే కోవిడ్ నియంత్రణకు అవసరమైన చర్యలను తీసుకుంటున్న కారణంగా తీవ్ర ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ప్రమాదం పొంచి ఉందంటున్నారు. చైనా లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేసిన తర్వాత.. కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో మళ్లీ చైనా నిబంధనలను కఠినతరం చేస్తోంది.

ఇవి కూడా చదవండి

చైనా, అమెరికా, దక్షిణ కొరియాల్లోని పరిస్థితులను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వారానికి దాదాపు 35 లక్షల కొత్త కేసులు నమోదవుతుండగా.. దేశంలో వారానికి 1200 కేసులు నమోదవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. కరోనా మళ్లీ విజృంభించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే రెండేళ్ల నాటి పరిస్థితులు తప్పవని రాష్ట్రాలను ఇప్పటికే కేంద్రప్రభుత్వం హెచ్చరించింది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా దేశంలో కోవిడ్ పరిస్థితులపై అధికారులతో సమీక్షించి.. కరోనా నియంత్రణ చర్యలపై సమీక్షించారు. కేంద్రప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీచేసే మార్గదర్శకాలను పాటించాలని కేంద్రమంత్రి కోరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..