AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Badrinath-Kedarnath: కేదారేశ్వరుడి రక్షణలో 30మంది ITBP గార్డులు.. ఎన్నడూ లేనిది ఇప్పుడెందుకంటే..?

కేదారేశ్వరుడి రక్షణ కోసం 30మంది ఇండో టిబెటన్ బోర్డర్ గార్డులు రంగంలోకి దిగారు. ఎన్నడూ లేనిది కేదారేశ్వరుని చెంత గార్డులెందుకన్న ప్రశ్న మీలో కలుగుతోంది కదూ..!

Badrinath-Kedarnath: కేదారేశ్వరుడి రక్షణలో 30మంది ITBP గార్డులు..  ఎన్నడూ లేనిది ఇప్పుడెందుకంటే..?
Kedarnath gets 30 ITBP guards​
Ram Naramaneni
|

Updated on: Dec 21, 2022 | 3:13 PM

Share

కేదార్‌నాథ్.. ఈ పేరు వింటేనే మనసు పులకరిస్తుంది. ఆధ్యాత్మిక వెల్లివిరుస్తుంది. ఆరు నెలలు తెరుచుకొని.. మరో ఆరు నెలలు మూసి ఉండే ప్రసిద్ధ పుణ్య క్షేత్రం కేదార్‌నాథ్. శీతాకాలంలో ఆలయం మూసివేసిన తర్వాత అక్కడ మనుషులు ఉండటానికి సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడి ఉష్ణోగ్రత మైనస్ 15 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతుంది. ఈ ఏడాది విశేషమేమిటంటే… ఆలయ పరిసరాల్లో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు పహరా కాయనున్నారు. ఎన్నడూ లేనిది కేదారేశ్వరుని చెంత గార్డులెందుకన్న ప్రశ్న మీలో కలుగుతోంది కదూ.. ఈ వివరాలు చూస్తే మీకు విషయం అర్థమవుతుంది.

కేదారేశ్వరుడి ఆలయంలో ఇటీవల బంగారు తాపడం చేశారు. ఆలయ పూజారులు దీన్ని వ్యతిరేకించినప్పటికీ ఆలయ బోర్డు ఈ ప్రక్రియను పూర్తిచేసింది. ఈ ఏడాది అక్టోబర్ 26 నాటికి గర్బ గుడిలో గోడలు, నాలుగు స్తంభాలు, సీలింగ్‌కు బంగారు తాపడం పూర్తయింది. మొత్తం 560 గోల్డ్ షీట్స్ ఇందుకు ఉపయోగించారు.ఈ షీట్స్ తయారీలో 40 కిలోలకు పైగా బంగారం వాడారని అంచనా. మహారాష్ట్రకు చెందిన ‘లాకి’ కుటుంబం ఈ బంగారాన్ని విరాళంగా సమకూర్చింది. 11,755 అడుగుల ఎత్తులో ఉన్న ఈ క్షేత్రంలో ఉష్ణోగ్రత అన్నికాలాల్లో తక్కువగా ఉంటుంది. శీతాకాలంలో కేదార్‌నాథ్ పరిసరాల్లో కురిసే మంచు 5 నుంచి 6 అడుగులమేరకు పేరుకుపోతుంది. శీతాకాలం ప్రారంభం కాగానే స్థానికులు ఇతర ప్రాంతాలకు తరలిపోతారు. శీతాకాలం పూర్తయిన తర్వాత మళ్లీ తమ ఇళ్లకు చేరుకుంటారు. శ్రీ భద్రీనాథ్, కేధార్‌నాథ్ ఆలయ కమిటీ ఛైర్మన్ అజేంద్ర అజయ్ విజ్ఞప్తిమేరకు ఆలయ రక్షణకు ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రెటరీ ఎస్ఎస్ సంధు ఐటీబీపీ బృందాన్ని ఆలయ రక్షణ విధుల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

ఈ నేపథ్యంలోనే….శీతాకాలం ప్రారంభంలో అక్టోబర్ 27న ఆలయం మూసివేత తర్వాత.. ఆలయ రక్షణకు 30 మంది ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ బృందాన్ని నియమించింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. మంగళవారం నుంచి వీరు తమ డ్యూటీని ప్రారంభించారు. ఆలయం తిరిగి 2023 ఏప్రిల్ నెలలో తెరవబడుతుంది. మైనస్ డిగ్రీల్లో విధులు నిర్వహించడం సవాలుతో కూడుకున్నది. షిప్టుకు ఇద్దరి చొప్పున 24గంటలు ఐటీబీపి సిబ్బంది గుడి పరిసరాల్లో విధులు నిర్వహిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..