Trending: ఏమి టాలెంట్‌ బాసూ.. కేవలం 3 లక్షలకే రోడ్డుమీద పరిగెత్తే హెలికాఫ్టర్‌ తయారు చేశాడు.. చూస్తే వావ్ అనాల్సిందే..

ఒక్కొక్కరిది ఒక్కో ఐడియా.. తమ సృజనాత్మకను చాటడానికి ఎటువంటి విద్యార్హతలు, ఇతర హోదాలు అవసరం లేదని నిరూపిస్తుంటారు కొంతమంది.. బుర్ర పెట్టి ఆలోచిస్తే చాలు.. ఎన్నో ఐడియాలు వస్తుంటాయి. కాని వాటన్నింటిని ఆచరణలో పెట్టడం అంత సులువేమి కాదు.. కాని ఓ కార్పెంటర్..

Trending: ఏమి టాలెంట్‌ బాసూ.. కేవలం 3 లక్షలకే రోడ్డుమీద పరిగెత్తే హెలికాఫ్టర్‌ తయారు చేశాడు.. చూస్తే వావ్ అనాల్సిందే..
Helicopter Model Car( Photo Source ANI)
Follow us

|

Updated on: Dec 21, 2022 | 3:05 PM

ఒక్కొక్కరిది ఒక్కో ఐడియా.. తమ సృజనాత్మకను చాటడానికి ఎటువంటి విద్యార్హతలు, ఇతర హోదాలు అవసరం లేదని నిరూపిస్తుంటారు కొంతమంది.. బుర్ర పెట్టి ఆలోచిస్తే చాలు.. ఎన్నో ఐడియాలు వస్తుంటాయి. కాని వాటన్నింటిని ఆచరణలో పెట్టడం అంత సులువేమి కాదు.. కాని ఓ కార్పెంటర్ తనకు వచ్చిన ఐడియాను ఆచరణలో పెట్టాడు. దానికి కొంత వెరైటీ జోడించడంతో.. రోడ్డుపై నడిచే హెలికాప్టర్ ను తయారు చేశాడు. సాధారణంగా రోడ్డుపై హెలికాప్టర్ నడుస్తోందని చెబితే ఎవరు నమ్ముతారు.. నమ్మరు.. ఎందుకంటే, హెలికాప్టర్ రోడ్డు మీద పరిగెత్తదు, గాలిలోనే ఎగురుతుంది అనేది వాస్తవం. అయితే దీనికి భిన్నంగా ఓకారును హెలికాప్టర్ లా మార్చేశాడు ఓ వడ్రంగి.. కనీసం కారు మెకానిక్ అయినా ఈ పనిచేశాడంటే ఓకే.. కాని ఓ కార్పెంటర్ కారు డిజైన్ ను మార్చి హెలికాప్టర్ రూపంలో తయారుచేశాడంటే నమశ్చక్యంగా లేదు కదా.. కాని ఇది వాస్తవం. ఒక వడ్రంగి రూపొందించిన హెలికాప్టర్ డిజైన్ ను పోలిన కారు రహదారిపై నడుస్తుంది.. అంతేకాదు గాలిలో ప్రయాణించే అనుభూతిని ఇస్తుంది. దేశంలో అతి చవకైన కారు ఏంటంటే వెంటనే గుర్తొచ్చేది.. నానో కారు.. కేవలం లక్ష రూపాయల్లోనే పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టాటా సంస్థ నానో కారును తయారుచేసింది. ఈ నానో కారు రూపు రేఖలు మార్చి హెలికాప్టర్ లా తయారుచేశాడు ఓ కార్పెంటర్. హెలికాప్టర్ గాల్లో నడిస్తే.. హెలికాప్టర్ ను పోలి ఉన్న ఈకారు మాత్రం రహదారులపై పరుగులు పెడుతోంది.

ఉత్తరప్రదేశ్ లోని ఆజంగఢ్ కు చెందిన ఓ కార్పెంటర్ సల్మాన్ నానో కారును హెలికాప్టర్ గా డిజైన్ చేశారు. ఇది రోడ్డుపై వెళ్లడమే కాకుండా.. కారులో ప్రయాణిస్తున్న వారికి విమాన ప్రయాణ అనుభూతిని కలిగిస్తుందంటున్నాడు దీని రూపకర్త. చూడటానికి అచ్చం హెలికాప్టర్ ను పోలి ఉంది ఈ కారు. తన సృజనాత్మకతను ఉపయోగించి.. కారు రూపాన్ని మార్చి హెలికాఫ్టర్ మోడల్ లో దీన్ని తయారు చేశాడు. దూరం నుంచి చూస్తే చిన్న హెలికాప్టర్ గా ఈ కారు కనిపిస్తోంది. రోడ్డుపై నడిచే హెలికాప్టర్ ను తయారుచేయడానికి నాలుగు నెలల సమయం పట్టింది సల్మాన్ కి. దీని కోసం 3 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. ఈ కారును తయారుచేశాక.. తనను ఎంతో మంది సంప్రదించారట. హెలికాప్టర్లలో ప్రయాణించలేని వారికి ఇది ఆ స్థాయి అనుభూతిని కలిగిస్తుందంటున్నాడు రూపకర్త. తన ఆలోచనలను ఇలాగే ముందుకు తీసుకెళ్తానని, భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు చేస్తానంటున్నాడు ఈ రూపకర్త. అంతేకాదు ప్రభుత్వం గానీ.. ఏవైనా మోటారు వాహనాల కంపెనీలు ముందుకొచ్చి తనకు సహాయం అందిస్తే నీరు, గాలితో నడిచే హెలికాప్టర్లను తయారుచేయగలనని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

అతి చవకైన కారును టాటా కంపెనీ తయారుచేస్తే.. అదే కారును ఉపయోగించి.. అతి తక్కువ ధరలో హెలికాప్టర్ మోడల్ కారును తయారుచేశాడు ఈ కార్పెంటర్ సల్మాన్. వివిధ కారులను చిన్న చిన్న డిజైన్ మార్పులు చేసి ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. అయితే సేమ్ టు సేమ్ హెలికాప్టర్ ను పోలి ఉండేలా కార్లు మార్కెట్లో అందుబాటులో లేవు. కేవలం హెలికాప్టర్ రూపమే కాదు.. కారు పైన రెక్కలను కూడా ఏర్పాటు చేశాడు. హెలికాప్టర్ ను పోలిన కారును చూసేందుకు చుట్టుపక్కల జనం క్యూ కడుతున్నారు. ఈ కారు రోడ్డుపై వెళ్తుంటే.. హెలికాప్టర్ రహదారిపై వెళ్తుందా అనే అనుమానం కలుగుతోంది. ఈకారు ఎక్కడ ఆగినా.. వింతగా చూస్తున్నారు చుట్టుపక్కల ప్రజలు. ఇప్పటికే ఇలాంటి కారును తయారుచేయాలంటూ అనేకమంది సల్మాన్ కు ఆర్డర్లు ఇస్తున్నారు. పెద్ద పెద్ద చదువులు చదవకపోయినా, తన సృజనాత్మకతను ఉపయోగించి.. ఓ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టిన కార్పెంటర్ సల్మాన్ ఎందరి ప్రశంసలో అందుకుంటున్నాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..