Covid-19: ఆ రాష్ట్రంలోనే సగానికి పైగా కరోనా కేసులు.. నిత్యం 20 వేలకు పైగానే.. మరణాలు ఎన్నంటే..?
Covid-19 third wave: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళలోనే సగానికిపైగా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా
Covid-19 third wave: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళలోనే సగానికిపైగా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ కొనసాగుతుండటంతో కేంద్రం రాష్ట్రాన్ని అప్రమత్తం చేసింది. దీంతో అక్కడ థర్డ్ వేవ్ మొదలైందన్న ఊహగానాలు మోదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే వీకెండ్ లాక్‌డౌన్ లాంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురించేస్తున్నాయి. దాదాపుగా 20రోజుల నుంచి 20 వేలకు పైగా కేసులు నమోదవుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. దీంతోపాటు వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి.
గత 24 గంటల్లో బుధవారం నుంచి గురువారం వరకు కొత్తగా 21,445 మంది కరోనా బారిన పడ్డారు. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 160 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 36,31,638కు పెరగగా.. మరణాల సంఖ్య 18,280కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 1.7 లక్షలకుపైగా ఉన్నాయి.
మరోవైపు గత 24 గంటల్లో 20,723 మంది కరోనా రోగులు కోలుకున్నట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 34,36,318కు చేరుకుందని వెల్లడించింది. ప్రస్తుతం కేరళలో 1,76,518 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 1,45,582 నమూనాలను పరీక్షించారు.
Also Read: