Delhi: లిక్కర్ స్కామ్ కేసులో కవితకు కస్టడీ పొడిగింపు.. చార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ..

ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెల్లడించింది. లిక్కర్‌ స్కామ్‌లో సౌత్‌ గ్రూప్‌ పేరుతో ఆప్‌కు రూ. 100 కోట్ల ముడుపులు చెల్లించినట్టు తెలిపింది. ఈడీ కేసులో కవిత జ్యుడిషియల్‌ కస్టడీని కోర్టు జులై 3వ తేదీ వరకు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్‌ కస్టడీని పొడిగించింది రౌస్‌ అవెన్యూ కోర్టు.

Delhi: లిక్కర్ స్కామ్ కేసులో కవితకు కస్టడీ పొడిగింపు.. చార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ..
Mlc Kavita
Follow us
Srikar T

|

Updated on: Jun 03, 2024 | 9:31 PM

ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెల్లడించింది. లిక్కర్‌ స్కామ్‌లో సౌత్‌ గ్రూప్‌ పేరుతో ఆప్‌కు రూ. 100 కోట్ల ముడుపులు చెల్లించినట్టు తెలిపింది. ఈడీ కేసులో కవిత జ్యుడిషియల్‌ కస్టడీని కోర్టు జులై 3వ తేదీ వరకు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్‌ కస్టడీని పొడిగించింది రౌస్‌ అవెన్యూ కోర్టు. ఈడీ కేసులో జులై 3 వ తేదీ వరకు కస్టడీని పొడిగించింది న్యాయస్థానం. ఈడీ కేసులో కవితపై ఇప్పటికే ఛార్జ్‌షీట్‌ దాఖలయ్యింది. సీబీఐ కేసులో కూడా కవిత కస్టడీని పొడిగించింది న్యాయస్థానం. ఈనెల 7వ తేదీ వరకు కస్టడీని పొడిగించింది కోర్టు . ఛార్జ్‌షీట్‌లో కీలక అంశాలను వెల్లడించింది ఈడీ. రూ.1100 కోట్ల స్కాం జరిగింది. 192 కోట్ల మేరకు ఇండో స్పిరిట్‌ సంస్థకు లాభాలు చేకూరాయని చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.

కవిత సౌత్‌ గ్రూప్‌ పేరుతో లావాదేవీలు సాగించి ఆప్‌ నేతలకు 100 కోట్ల రూపాయల వరకు ముడుపులు చెల్లించారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరట్‌ తాజా ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఈ ఛార్జ్‌షీట్‌లో కవితను 32వ నిందితురాలిగా చూపారు. మొత్తం 36 మందిని నిందితులుగా పేర్కొంది. కుట్రలో భాగంగా ఏర్పాటు చేసిన ఇండో స్పిరిట్స్‌ సంస్థ ద్వారా 292.8 కోట్ల రూపాయల నేరం జరిగిందని ఈడీ తెలిపింది. ఈ కేసులో తన పాత్రను కప్పిపుచ్చేందుకు సాక్ష్యాలు తొలగించడంతో పాటు 9 మొబైల్‌ ఫోన్లను కవిత ధ్వంసం చేశారని ఛార్జ్‌షీట్‌లో ఈడీ వివరించింది. విచారణకు ఆమె అందజేసిన తొమ్మిది మొబైల్‌ ఫోన్స్‌ అన్ని ఫార్మట్‌ చేశారని, వాటిలో ఎటువంటి డేటా లేదని తెలిపింది. ఈ ఛార్జ్‌షీట్‌ 177 పేజీలుంది. కవిత స్టేట్‌మెంట్‌ను కూడా ఈడీ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఇప్పటికే లిక్కర్‌ స్కాంలో 18 మందిని అరెస్ట్‌ చేసింది ఈడీ. 44 మంది సాక్షుల స్టేట్‌మెంట్లను రికార్డు చేసినట్టు వెల్లడించింది. ఈ కేసులో మొత్తం 49 మందిని విచారించినట్టు తెలిపింది. కవితపై చార్జ్‌షీట్‌లో శరత్‌చంద్రారెడ్డి స్టేట్‌మెంట్లను ఈడీ ప్రస్తావించింది. నిందితుల ఆస్తులను జప్తు చేయాలని ఈడీ కోరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..