Coronavirus Positive Cases India: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,08,921 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 4157 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,71,57,795కి చేరుకుంది. ఇందులో 24,95,591 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,11,388 మంది కరోనాతో మరణించారు. అటు గడిచిన 24 గంటల్లో 2,95,955 మంది డిశ్చార్జ్ కావడంతో.. మొత్తంగా దేశంలో ఇప్పటివరకు 2,43,50,816 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 89.66శాతం ఉండగా.. మరణాల రేటు 1.15శాతం ఉంది. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 22,17,320 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఇప్పటివరు 33,48,11,496 పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ వెల్లడించింది. కాగా, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటిదాకా 20,06,62,456 మందికి వ్యాక్సినేషన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
Also Read:
చిరుత, పైథాన్ మధ్య భీకర పోరు.. గగుర్పొడిచే వైరల్ వీడియో.. విజేత ఎవరో తెలుసా.!
మందు గ్లాస్‌తో మతిపొగొట్టిన బుడ్డొడు… నెటిజన్లు ఫిదా.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!
పెళ్లికి ముందు ఆ నటితో విరాట్ కోహ్లీ ఎఫైర్.. ఆమె ఎవరంటే.!
వీటిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా.? అయితే డేంజరే.! ఏవి పెట్టాలో తెలుసుకోండి.!
#IndiaFightsCorona:#COVID19Vaccination Status (As on 26th May, 2021, 8:00 AM)
✅Total vaccine doses administered (so far): 20,06,62,456
✅Vaccine doses administered (in last 24 hours): 20,39,087#We4Vaccine #LargestVaccinationDrive@ICMRDELHI @DBTIndia pic.twitter.com/Ngq3l6cwh7
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) May 26, 2021