కరోనా అప్‌డేట్స్: దేశవ్యాప్తంగా 85లక్షలు దాటిన కేసుల సంఖ్య
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ కూడా స్టార్ట్ అయ్యింది.

India Corona Updates: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 45,674 కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 85,07,754కు చేరింది. ఇక కరోనా నుంచి 24 గంటల్లో 49,082 మంది కోలుకోగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 78,68,968కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 559 మంది కరోనాతో మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 1,26,121కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,12,665 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో 11,94,487 టెస్ట్‌లు చేయగా.. మొత్తం టెస్ట్‌ల సంఖ్య 11,77,36,791కి చేరింది.
Read More:
మరోసారి కలిసి పనిచేయబోతున్న బన్నీ-త్రివిక్రమ్..!
Corona Deaths IndiaCorona India deathsIndia Corona CasesIndia Corona UpdatesRecovered numbers in India