టీవీ9 ఎగ్జిట్‌పోల్..‌ బీహార్‌ ఫలితాల్లో సంచలనాలు

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Nov 08, 2020 | 9:34 AM

బీహార్ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. బీజేపీ కూటమికి మరోసారి అధికారం దక్కుతుందా? కాంగ్రెస్ చరిత్రను తిరగరాస్తుందా.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నాయి..

టీవీ9 ఎగ్జిట్‌పోల్..‌ బీహార్‌ ఫలితాల్లో సంచలనాలు

Exit poll results: బీహార్‌లో సర్వేలన్నీ ఒకటే మాట. మహాగట్భందన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ముక్తకంఠంతో తేల్చి చెప్పాయి ఎగ్జిట్ పోల్స్‌. ఎన్డీయే కూటమి ఓటమి తప్పదనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి. టైమ్స్‌ నౌ, పీపుల్స్‌ పల్స్‌,ఏబీసీ న్యూస్‌,రిపబ్లిక్‌ జన్‌కీ బాత్‌ ఇక టీవీ9 నెట్‌వర్క్‌తో సహా మహాగట్భందన్‌ వైపే మొగ్గుచూపాయి.

మహా కూటమికి 120, అధికార ఎన్డీయేకు 116 సీట్లు, ఎల్జేపీకి 1, ఇతరులకు 6 స్థానాలు వస్తాయని టైమ్స్‌నౌ- సి ఓటర్‌ పేర్కొంది. ఇక రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లోనూ… ఆర్జేడీకే హెడ్జ్‌ ఉంటుందని ప్రకటించింది. మహాగట్బందన్‌ 118 నుంచి 138 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఎన్డీయే కూటమికి 91 నుంచి 117 స్థానాలు వస్తాయంది.

ఇక పీపుల్స్‌ పల్స్‌ సైతం మహా కూటమివైపే ఓటర్లు మొగ్గినట్లు చూపించింది. ఆ కూటమికి 100-115 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఎన్డీయేకు 90-110 స్థానాలు రావొచ్చని పేర్కొంది. ఎల్జేపీ 3-5, ఇతరులు 8-18 స్థానాలు దక్కించుకుంటాయని పేర్కొంది. ఇక ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో తేజస్వి యాదవ్‌కు 44 శాతం మంది మద్దతు తెలపగా.. నీతీశ్‌ కుమార్‌కు 35 శాతం మద్దతు లభించింది. చిరాగ్‌ పాస్వాన్‌కు 7 శాతం మంది ఓటేశారు.

ఇక ఓటరు నాడిని పట్టుకునేందుకు TV9 నెట్‌వర్క్ ప్రయత్నించింది. TV9 నెట్‌వర్క్ ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలో… మహా ఘట బంధన్‌కు స్వల్ప ఆధిక్యం లభించింది.RJD-కాంగ్రెస్‌-వామపక్షాలు కలిసి పోటీ చేసిన మహా ఘట్‌బంధన్‌కు 115 నుంచి 125 స్థానాలు వస్తాయని మా TV9 నెట్‌వర్క్‌ నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్‌లో తేలింది.

అధికార జేడీయూ-బీజేపీ కూటమి సైతం వందకు పైగా సీట్లు సాధించనుంది. వాళ్లకు 110 నుంచి 120 సీట్లు రావచ్చని స్పష్టమవుతోంది. ఇక, ఎల్జీపీ మూడు నుంచి ఐదు సీట్లు, ఇతరులకు 10 నుంచి 15 సీట్లు రావొచ్చని టీవీ9 నెట్‌వర్క్‌ ఎగ్జిట్‌పోల్‌ చెప్తోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu