సంచలనం: కీసర తహసీల్దార్ నాగరాజు లంచం కేసులో మరో సూసైడ్
కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కోటి పది లక్షల లంచం కేసులో అరెస్టై ఇటీవల బెయిల్ పై వచ్చిన కుషాయిగూడ నాగార్జున నగర్ కాలనీకి చెందిన ధర్మారెడ్డి, వాసవి శివ నగర్ కాలనీలో ఈ ఉదయం చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, ఈ ఆత్మహత్య పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ముమ్మాటికీ హత్యేనన్న అనుమానాలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఇదే కేసులో బెయిల్ దొరకకపోవడంతో మృతుడు ధర్మారెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం జైల్లోనే […]

కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కోటి పది లక్షల లంచం కేసులో అరెస్టై ఇటీవల బెయిల్ పై వచ్చిన కుషాయిగూడ నాగార్జున నగర్ కాలనీకి చెందిన ధర్మారెడ్డి, వాసవి శివ నగర్ కాలనీలో ఈ ఉదయం చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, ఈ ఆత్మహత్య పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ముమ్మాటికీ హత్యేనన్న అనుమానాలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఇదే కేసులో బెయిల్ దొరకకపోవడంతో మృతుడు ధర్మారెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు. కాగా, కీసర ఏసీబీ ట్రాప్ కేసులో మరో సూసైడ్ జరగడంతో ఈ కేసు మరింత సంచలనంగా మారుతోంది. గతంలోనే కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నాగరాజు మీద నమోదు అయిన రెండో కేసులో నిందితుడిగా ధర్మా రెడ్డి, ఆయన కుమారుడు శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు.