Corona Effect: మరీ ఇంత దారుణమా?.. కరోనా సోకిన మహిళనూ వదలని కీచకుడు.. విసిగిపోయిన మహిళ చివరికి ఏం చేసిందంటే..
Corona Effect: మహారాష్ట్రలోని ముంబై నగరంలో దారుణం వెలుగు చూసింది. ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. కరోనా పేషెంట్ అని తెలిసి కూడా..
Corona Effect: మహారాష్ట్రలోని ముంబై నగరంలో దారుణం వెలుగు చూసింది. ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. కరోనా పేషెంట్ అని తెలిసి కూడా వదల్లేదు. హోటల్‌లో ఐసోలేషన్‌లో ఉన్న మహిళలను వేధింపులకు గురిచేశాడు. ఆమె గదిలోకి వెళ్లి బాధిత మహిళను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. చివరికి బాధితురాలు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఆ కీచకుడి భరతం పట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముంబై నగరంలోని అంధేరి ప్రాంతానికి చెందిన ఓ మహిళకు కరోనా సోకింది. దాంతో ఆమె ఓ హోటల్ రూమ్‌లో ఐసోలేషన్‌లో ఉంది. అక్కడే ఆమె వైద్యుల సహకారంతో చికిత్స పొందుతోంది. అయితే, ఆమెపై ఓ వైద్య ఉద్యోగి కన్ను పడింది. ఆమెకు కరోనా అని తెలిసి కూడా లైట్ తీసుకున్నాడు. కామంతో కళ్లు మూసుకుపోయి ఉన్న ఆ కీచకుడు.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.
తరచూ ఆమె గదికి వెళ్లడం.. ఆమెతో అసభ్యంగా మాట్లాడటం, తాకరాచిన చోట తాకడం వంటివి చేస్తుండేవాడు. తన కోరికను తీర్చాలంటూ బాధిత మహిళను ఆ కీచకుడు వేధింపులకు గురి చేశాడు. బాధిత మహిళ ఎంత హెచ్చరించినా వినకుండా మరింత రెచ్చిపోయాడు. దాంతో అతని తీరుకు విసిగిపోయిన బాధిత మహిళ.. పోలీసులకు ఫోన్ చేసింది. జరిగిన విషయాన్ని వారికి వివరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ కీచకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. కాగా, మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా ఉపయోగం లేకుండా పోతోంది. ఇలాంటి దుర్మార్గుల వల్ల మహిళలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కరోనా సోకిన మహిళను సైతం కీచకులు వదలడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also read: