Horoscope Today: ఈరోజు ఏ రాశివారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి.. రాశివారికి ఉద్యోగ ఫలితాలు ఇస్తాయంటే

Horoscope Today 16th April: రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా మనం రోజు మొదలు పెట్టాలనుకుంటే.. ఆ రోజు జరగబోయే మంచి చెడుల గురించి తెలుసుకోవాలని...

Horoscope Today: ఈరోజు ఏ రాశివారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి.. రాశివారికి ఉద్యోగ ఫలితాలు ఇస్తాయంటే
Horoscope Today
Follow us
Surya Kala

|

Updated on: Apr 16, 2021 | 6:30 AM

Horoscope Today 16th April: రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా మనం రోజు మొదలు పెట్టాలనుకుంటే.. ఆ రోజు జరగబోయే మంచి చెడుల గురించి తెలుసుకోవాలని.. అప్పుడు ఏమి చేయాలి అనే విషయం గురించి ఓ అంచనాకు రావాలని.. రాశిఫలాలను చూస్తుంటారు. ఈ రోజు ఏప్రిల్ 16 శుక్రవారం రోజున ఏ రాశివారికి ఏ విధమైన ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం.

మేష రాశి :

ఈ రాశి వారికి ఈ రోజు వేరు వేరు రూపాల్లో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటారు. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండడం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్చన మేలు చేస్తుంది.

వృషభరాశి:

ఈ రాశి వారికి నూతన ఉద్యోగ లాభాలు కలిసివస్తాయి.. మర్యాదలు కోల్పోకుండా వ్యవహరిస్తుండాలి. లలితా అమ్మవారి నామస్మరణ మేలు చేస్తుంది.

మిథున రాశి: ఈ రాశి వారికి ఈ రోజు శ్రమ ఫలిస్తుంది. క్రయవిక్రయాల్లో లాభాలు కలిసివస్తాయి. శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.

కర్కాటక రాశి:

ఈ రాశి వారికి ఈ రోజు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఇష్టవస్తు ప్రాప్తి లభిస్తుంది. ఆంజనేయస్వామికి తమలపాకులతో అర్చన మేలు చేస్తుంది.

సింహ రాశి:

ఈ రాశివారు వ్యాపార వ్యావహారిక విషయాల్లో అభివృద్ధికి సంబంధించినటు వంటి నిర్ణయాలు తీసుకుంటూవుంటారు. సామజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గౌరీ అమ్మవారికి పసుపుకుంకుమలు సమర్పించడం మంచిది.

కన్యా రాశి :

ఈ రాశివారు ఈ రోజు సంఘంలో గౌరవాలు ఏర్పడతాయి. పెట్టుబడుల విషయాల్లో పెద్దవారి ఆలోచనలు గౌరవించడం మంచిది. శ్రీవెంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవలో.. లేదా సుప్రభాత స్త్రోత్ర పారాయణం మంచిది.

తుల రాశి:

ఈ రాశి వారు ఈ రోజు ఆర్ధిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా వాటిని అధిగమించే ఆలోచన చేయాలి. అష్టలక్ష్మి స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి:

ఈ రాశి వారు ఈ రోజు ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ, వ్యాపారాత్మకమైన విషయాల్లో మిశ్రమైన ఫలితాలు ఏర్పడతాయి. గణపతికి అర్చన నిర్వహించడం మంచిది.

ధనస్సు రాశి:

ఈ రాశి వారు చర్చలు ఫలిస్తాయి. ఆర్ధిక విషయాల్లో లాభాల బాట పడతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.

మకర రాశి:

ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబం పరమైన పలు కార్యక్రమాలు చేపడుతుంటారు. పలు రకాల విందు వినోదమైన కార్యక్రమాల్లో అనుకూలత ఏర్పడుతుంది. శివపంచాక్షరీ మంత్రం మేలు చేస్తుంది.

కుంభ రాశి:

ఈ రాశి ఈరోజు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సామజిక గౌరవాలు కోల్పోకుండా ఉండాలి. దుర్గ సప్త శ్లోకీ పారాయణం మేలు చేస్తుంది.

మీన రాశి:

ఈ రాశి వారు ఈ రోజు అనారోగ్య సంబంధిత విషయాల్లో అలక్ష్యం చేయరాదు. డాక్టర్లను సంప్రదించడం మంచిది. ఆదిత్య హృదయ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.

Also Read:  నరుడుగా పుట్టి.. దైవంగా పూజలందుకుంటున్న శ్రీరాముడి గుణాలు ఏమిటంటే..!

 కరోనాకు ఆప్తులను, స్నేహితులను కోల్పోయారా? అయితే శ్రీకృష్ణుడి అంత్యక్రియల గురించి తెలుసుకోవాల్సిందే

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..