Horoscope Today :చిన్ననాటి స్నేహితులను కలుసుకొనే ఈరాశివారు.. ఆర్ధిక, పెట్టుబడుల విషయంలో ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే

Horoscope Today : తమకు మంచి జరగాలన్నా.. ఏపని మొదలు పెట్టాలన్నా తమ నామ నక్షత్రం,  జన్మనక్షత్రం బట్టి .. రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు ఎంతో మంది..

Horoscope Today :చిన్ననాటి స్నేహితులను కలుసుకొనే ఈరాశివారు.. ఆర్ధిక, పెట్టుబడుల విషయంలో ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే
Horoscope Today
Follow us
Surya Kala

|

Updated on: Apr 17, 2021 | 6:23 AM

Horoscope Today : తమకు మంచి జరగాలన్నా.. ఏపని మొదలు పెట్టాలన్నా తమ నామ నక్షత్రం,  జన్మనక్షత్రం బట్టి .. రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా మనం రోజు మొదలు పెట్టాలనుకుంటే.. ఆ రోజు జరగబోయే మంచి చెడుల గురించి తెలుసుకుంటారు. రాశిఫలాలను చూస్తుంటారు. ఈ రోజు ఏప్రిల్ 17 శనివారం ఏ రాశివారికి ఏ విధమైన ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం.

మేష రాశి :

ఈ రాశి వారికి ఈ రోజు చేపట్టినటువంటి పనుల్లో నిదానంగా వ్యవహరించాలి. తొందరపడి వ్యవహరించడం వలన అనవసరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. నవగ్రహ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.

వృషభరాశి:

ఈ రాశి వారికి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదిత్య స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.

మిథున రాశి: ఈ రాశి వారికి ఈ రోజు వృత్తి వ్యాపారాల్లో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల యొక్క గౌరవాలు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విశేషమైనటువంటి గౌరీ శంకరుల అర్చన మేలు చేస్తుంది.

కర్కాటక రాశి:

ఈ రాశి వారికి ఈ రోజు సామజిక గౌరవాన్ని కోల్పోకుండా పెద్దవారిని కలుసుకుంటారు. విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సూర్య నారాయణస్వామి అర్చన మేలు చేస్తుంది.

సింహ రాశి:

ఈ రాశివారు ఈరోజు శక్తికి మించినటువంటి పనులు చేపడుతుంటారు. వ్యాపారాల్లో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. దుర్గమ్మవారికి పాయసం నివేదన చేసుకోవడం మంచిది.

కన్యా రాశి :

ఈ రాశివారు ఈ రోజు ఉద్యోగ, వ్యాపార పరంగా సమీక్షలు ప్రారంభమవుతాయి. పిల్లల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పేదవారికి కాయగూరలు దానం చేయడం మంచిది.

తుల రాశి:

ఈ రాశి వారు ఈ రోజు ఒప్పందాలను సమీక్ష చేసుకుంటారు. సామజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అష్టలక్ష్మి స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి:

ఈ రాశి వారు ఈ రోజు షేర్స్, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సామజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయాలకు, ఆశ్రమాలకు కొంత దానధర్మాలు చేసే ప్రయత్నం చేస్తారు. శివ పంచాక్షరి జపం మేలు చేస్తుంది.

ధనస్సు రాశి:

ఈ రాశి వారు ఈరోజు వ్యాపార వ్యవహార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనుకోని అవకాశాలు మేలు చేస్తాయి. దుర్గా సప్త శ్లోకి పారాయణం మేలు చేస్తుంది.

మకర రాశి:

ఈ రాశి వారికి ఈ రోజు వృత్తిపరమైన ఆటంకాలను అధిగమించే సందర్భాలుంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శనీశ్వర స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కుంభ రాశి:

ఈ రాశి ఈరోజు కుటుంబ సభ్యుల నుంచి సహకారం తక్కువగా ఉంటుంది. అనవసరమైన ఒత్తిడి కలుగుతుంది. దుర్గాసప్త శ్లోకి పారాయణం మేలు చేస్తుంది.

మీన రాశి:

ఈ రాశి వారు ఈ రోజు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. అనారోగ్య సంబంధిత భావనలు తగ్గుతాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ధన్వంతరి స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.

Also Read:  రంజాన్ నెలలో ఉపవాస దీక్ష చేస్తున్నారా.. ఆరోగ్యంగా ఉండాలంటే ఇఫ్తార్ విందులో వీటిని చేర్చుకుంటే సరి