సోనియాకు వీరప్పమొయిలీ సారీ

కాంగ్రెస్‌ పార్టీ లో బుజ్జగింపులు, ఆరోపణలు, క్షమాపణల పరంపర కొనసాగుతోంది. సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ సీనియర్లపై మండిపడిన నేపథ్యంలో..

సోనియాకు వీరప్పమొయిలీ సారీ
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Aug 25, 2020 | 8:30 PM

కాంగ్రెస్‌ పార్టీ లో బుజ్జగింపులు, ఆరోపణలు, క్షమాపణల పరంపర కొనసాగుతోంది. సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ సీనియర్లపై మండిపడిన నేపథ్యంలో వీరప్ప మొయిలీ తన వాణి వినిపించారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నాయకత్వాన్ని తామెప్పుడూ ప్రశ్నించలేదన్నారు. సోనియా పార్టీకి తల్లిలాంటివారని.. ఆమె మనోభావాలను కించపరిచే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పారు. ఒకవేళ తెలిసోతెలియకో అలాంటిది జరిగి ఉంటే క్షమాపణ కోరుతున్నామన్నారు. ఆమె పట్ల ఎల్లవేళలా గౌరవ మర్యాదలు, కృతజ్ఞతాభావం కలిగి ఉంటామని పేర్కొన్నారు. అయితే, పార్టీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్న ఆయన, పార్టీ అంతర్గత విషయాలను బట్టబయలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.