AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big Story: కోవిడ్-19 తో జాబ్స్ లేక ఉసూరుమంటున్నారా ? అయితే మీకోసం !

కరోనా నిజంగానే 'కరిచేస్తోంది'. ఉద్యోగాలకే ఎసరు తెచ్చిన ఈ మహమ్మారితో నిరుద్యోగులు ఉసూరుమంటున్నారు. చేతిలో సత్తా, మెదడులో మంచి తెలివితేటలు ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి ! ఏం చేయాలో తోచని స్థితి ! అదిగో ! ఇలాంటి తరుణంలో..

Big Story: కోవిడ్-19 తో జాబ్స్ లేక ఉసూరుమంటున్నారా ? అయితే మీకోసం !
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 25, 2020 | 9:17 PM

Share

కరోనా నిజంగానే ‘కరిచేస్తోంది’. ఉద్యోగాలకే ఎసరు తెచ్చిన ఈ మహమ్మారితో నిరుద్యోగులు ఉసూరుమంటున్నారు. చేతిలో సత్తా, మెదడులో మంచి తెలివితేటలు ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి ! ఏం చేయాలో తోచని స్థితి ! అదిగో ! ఇలాంటి తరుణంలోనే చిమ్మ చీకటిలో మెరుపులా, తళుక్కుమనే డిజిటల్ జాబ్స్ మేమున్నామంటూ ఊరిస్తున్నాయి. లక్షణంగా ఇంటి నుంచే పని…చేతినిండా పని.. ‘చేనుకు చేవ..రైతుకు రొక్కం’ లా శుభ్రంగా ఇంట్లోనే కూర్చుని నాలుగు డబ్బులు సంపాదించుకునే రోజులు కూడా ఇవి ! కరోనా ఒక విధంగా మేలే చేసిందని నిరుద్యోగులు యమ సంతోష పడే కాలమంటే ఇదే కాదూ మరి ?

కరోనా, లాక్ డౌన్ కారణంగా సర్వీసు రంగం కుదేలయింది. కానీ ఆప్షన్లు మాత్రం బోలెడున్నాయి. ఎన్నో కొత్త డిజిటల్ ఎవెన్యూలు కవాటాల్లా వాటికవే తెరచుకున్నాయి. వీటిలో ఇన్స్ టాగ్రామ్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ కన్సల్టెంట్, గ్రాఫిక్ డిజైనర్, బ్లాగింగ్, ప్రూఫ్ రీడింగ్, అండ్ ట్రాన్స్ క్రైబింగ్ లాంటి జాబ్స్ ‘ప్లీజ్ కమ్ ‘అని ఆహ్వానిస్తున్నాయి.

కస్టమర్లతో తెలివిగా చాట్  చేయగలిగి, ఇన్స్ టాగ్రామ్ అకౌంట్ ఉంటే చాలు..ఈ మార్కెటింగ్ కాసులు పండిస్తుంది .. ఇక సోషల్ మీడియా మార్కెటింగ్ కన్సల్టెంట్ ఆంటే జొమాటో నుంచి నెట్ ఫ్లిక్స్ వరకు ‘వరాలు’ ఉండనే ఉన్నాయి. మన ‘కుక్కర్’ ‘చోలే’ ఉందంటే అది ఈ జాబ్ మహిమే !

వీటి సోషల్ మీడియా పేజెస్ లో వీటి ఉత్పత్తులకు ప్రచారం చేయడం ద్వారా మన జేబులు వాటికవే నిండుతాయి.

గ్రాఫిక్ డిజైనర్ కావాలనుకుంటే బేసిక్ ఫోటోషాప్, ఇతర విద్యలూ తెలిసి ఉంటే ఇంట్లోనే కూర్చుని ‘బ్యూ కాప్ బక్స్’ సంపాదించుకోవచ్చు.

ఇంటర్నెట్ ద్వారానే బ్లాగింగ్, ప్రూఫ్ రీడింగ్ చేస్తూ పోతే చేసేది కొన్ని గంటలైనా.. వచ్ఛేసొమ్ము మాత్రం బోలెడంత ! ఇంకెందుకాలస్యం ? ప్లీజ్ ! ప్రొసీడ్ !

వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం