AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MP Dheeraj Sahu: ఎంపీ సాహు ఇంట్లో కొనసాగుతున్న నోట్ల లెక్కింపు.. రూ. 353.5 కోట్లు లభ్యం.. మరింత పెరిగే అవకాశం

స్టేట్ బ్యాంక్‌కు చెందిన 50 మందికి పైగా ఉద్యోగులు 25 కంటే ఎక్కువ యంత్రాలను ఉపయోగించి ఈ నోట్లను లెక్కించారు. కౌంటింగ్ సమయంలో యంత్రాలు రెండుసార్లు వేడెక్కాయి. అందువల్ల ఓట్ల లెక్కింపు నుంచి కొన్ని యాత్రలకు విశ్రాంతినిచ్చారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు సైతం ఆశ్చర్య పడే విధంగా భారీ నగదు బయటపడింది. అంతకు ముందు 2019లో కాన్పూర్‌లో నిర్వహించిన జీఎస్టీ రైడ్‌లో రూ.257 కోట్లు దొరికాయి.

MP Dheeraj Sahu: ఎంపీ సాహు ఇంట్లో కొనసాగుతున్న నోట్ల లెక్కింపు.. రూ. 353.5 కోట్లు లభ్యం.. మరింత పెరిగే అవకాశం
Congress Mp Dhiraj Sahu
Surya Kala
|

Updated on: Dec 11, 2023 | 3:46 PM

Share

ఒక ఎంపీ ఇంట్లో నగదు, బంగారం తవ్వే కొద్దీ బయటకు వస్తున్నాయి. లెక్కించే కొద్దీ కట్టల కట్టల నగదు వెలుగులోకి వస్తూ అందరికి షాక్ ఇస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు చెందిన    జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో దాదాపు 9 స్థానాల్లో ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేశారు. తమకు దొరికిన నోట్ల లెక్కింపు రాంచీలోని సాహు ఇంట్లో ఇంకా కొనసాగుతోంది. అయితే మిగిలిన అన్ని చోట్ల కౌంటింగ్ దాదాపు పూర్తయింది. ఇప్పటి వరకు రూ.353.5 కోట్ల నగదు దొరికింది. రాంచీ ఇంట్లో నోట్ల లెక్కింపు కొనసాగుతోంది కనుక ఈ నగదు సంఖ్య మరింత పెరగవచ్చు.

స్థానిక బ్యాంకుల ప్రకారం స్టేట్ బ్యాంక్‌కు చెందిన 50 మందికి పైగా ఉద్యోగులు 25 కంటే ఎక్కువ యంత్రాలను ఉపయోగించి ఈ నోట్లను లెక్కించారు. కౌంటింగ్ సమయంలో యంత్రాలు రెండుసార్లు వేడెక్కాయి. అందువల్ల ఓట్ల లెక్కింపు నుంచి కొన్ని యాత్రలకు విశ్రాంతినిచ్చారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు సైతం ఆశ్చర్య పడే విధంగా భారీ నగదు బయటపడింది. అంతకు ముందు 2019లో కాన్పూర్‌లో నిర్వహించిన జీఎస్టీ రైడ్‌లో రూ.257 కోట్లు దొరికాయి.

అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందంటే..

ఇప్పటి వరకూ ఆదాయపు పన్ను శాఖ ఈ రైడ్ కు సంబంధించి అధికారికంగా ప్రకటన చేయలేదు. నగదు లెక్కింపు పూర్తయిన తర్వాత ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే నగదు, నగలు, ఆస్తి సహా అన్ని పత్రాలను అంచనా వేసిన తర్వాత మాత్రమే భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను శాఖ తన అధికారిక ప్రకటన చేస్తుంది. ఆపరేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే నగదు, ఇతర రికవరీలకు సంబంధించి సంబంధిత వ్యక్తిని డిపార్ట్‌మెంట్ ప్రశ్నలు అడుగుతుంది.

ఇవి కూడా చదవండి

సరైన వివరాలు ఇవ్వకుంటే..డబ్బు జప్తు

నగదు, రికవరీ అయిన ఆభరణాలు, ఆస్తులకు సంబంధించిన సరైన వివరాలు ఇవ్వకపోతే రికవరీని సీజ్ చేసి బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. రాంచీలో కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఆదాయపు పన్ను శాఖ ధీరజ్ సాహును విచారించనుంది. సాహు కుటుంబ సభ్యుల దగ్గర చాలా నగదు దొరికినందున.. వారందరికీ విచారణ నోటీసు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోనుంది ఆదాయపు పన్ను శాఖ.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..