Congress Politics: కాంగ్రెస్‌లో ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ వ్యవస్థ ఔట్..? పీకే ఎఫెక్టేనా..?

| Edited By: Shiva Prajapati

May 02, 2022 | 8:07 PM

Congress Politics: కాంగ్రెస్‌లో ఆ పోస్టు గ్రూపు రాజకీయాలకు దారితీస్తుందా..? ఆ పోస్ట్ లో ఎవరు వచ్చినా వారికి అనుకూలంగా.. వ్యతిరేకంగా వర్గాలు తయారవుతున్నాయా..?

Congress Politics: కాంగ్రెస్‌లో ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ వ్యవస్థ ఔట్..? పీకే ఎఫెక్టేనా..?
Congress
Follow us on

Congress Politics: కాంగ్రెస్‌లో ఆ పోస్టు గ్రూపు రాజకీయాలకు దారితీస్తుందా..? ఆ పోస్ట్ లో ఎవరు వచ్చినా వారికి అనుకూలంగా.. వ్యతిరేకంగా వర్గాలు తయారవుతున్నాయా..? పీకే సోనియాగాంధీ కి ఇచ్చిన రిపోర్ట్‌లో ఆ వ్యవస్థ వల్లే పార్టీలో ఇబ్బందులున్నాయా..? త్వరలోనే అన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌లో ఆ వ్యవస్థ రద్దు కాబోతుందా..? ఇంతకి అపోస్టు ఏంటి..? దాని కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కాంగ్రెస్ పార్టీలో ఏ రాష్ట్రానికైనా ఎఐసిసి వ్యవహారాల ఇంచార్జ్ అనే వ్యవస్థ చాలా కీలకమైంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రోగ్రామ్స్‌తో వారి కార్యాచరణ తదితర అంశాలపై ఏఐసీసీ ఇంచార్జ్ బాద్యులుగా ఉంటారు. ప్రతి రాష్ట్రంలో పీసిసి కి, ఈయన కి తాజా రాజకీయాలు, పార్టీ కి సంబంధించిన అంశాలు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎఐసిసి ఇంచార్జ్ పదవి కాంగ్రెస్‌లో ఒక రాష్ట్రంలో ఉన్న కీలక నేతకు వేరే రాష్ట్రంలో ఎఐసిసి ఇంచార్జ్ పదవి అనేది అధిష్టానం కట్టబెడుతుంది. ఆ నేత రాష్ట్రంలో సామాన్య రాజకీయ నేత అయినా సరే ఆయన ఇంచార్జ్ గా ఉన్న రాష్ట్రంలో మాత్రం పెద్ద ప్రొటోకాల్ తో హడావిడి బాగానే ఉంటుంది.

అయితే ప్రస్తుతం ఈ పోస్ట్ వల్లే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందట. ఇంచార్జ్ గా వచ్చిన వారు వారికి అనుకూలంగా ఉన్న నేతలతో సఖ్యతగా ఉండడం, మంచి ప్రాధాన్యత కల్పించడం వ్యతిరేకంగా ఉన్న నేతలపై అధిష్ఠానానికి తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం చేస్తున్నారట. దీంతో ప్రతి రాష్ట్రంలో ఏఐసిసి వ్యవహారాల ఇంచార్జ్ వల్ల పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, గ్రూపు రాజకీయాలు పెరిగిపోతున్నాయట. రాష్ట్రాల్లో ఏఐసిసి ఇంచార్జ్ పోస్ట్ వల్ల అధిష్ఠానానికి కొత్త తలనొప్పులు వస్తున్నాయట. గతంలో మన రాష్ట్రానికి కుంతియా నుండి ప్రస్తుతం ఉన్న ఠాగూర్ వరకు ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. ఇలాంటి పరిస్థితి అన్ని రాష్ట్రాల్లో ఉందని అధిష్టానం భావిస్తుంది.

ఎఐసిసి ఇంచార్జ్ పదవి వల్లే పార్టీలో ఇబ్బందులు వస్తున్నాయని పీకే సోనియా గాంధీకి ఇచ్చిన రిపోర్ట్ లో వెల్లడించినట్లు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఏఐసిసి ప్రక్షాళన తరువాత త్వరలోనే ఏఐసిసి వ్యవహారాల ఇంచార్జ్ వ్యవస్థ ను పూర్తిగా తొలగించి ప్రత్యామ్నాయ మరో వ్యవస్థ రానున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన వైపు వెళ్తుండడంతో పీకే నివేదికలోని అంశాల్లో భాగంగా ఇంచార్జ్ పదవిని తొలగిస్తారా.. లేక వారిపై మరో దూతను పెడతారా అనేది తేలాలంటే వేచి చూడాల్సిందే.

Also read:

Viral Video: తొలిసారి బాదంపప్పు టేస్ట్ చేసిన ఉడత.. దాని రియాక్షన్ అస్సలు ఊహించలేరు..!

Astro Tips: స్నానం చేసిన తరువాత ఈ 8 పనులు అస్సలు చేయొద్దు.. లేదంటే భారీ నష్టం తప్పదు..!

Viral Video: షాకింగ్.. మెరుపు వేగంతో డేగ వేట.. వీడియో చూస్తే చెమటలు పట్టడం ఖాయం..!