Viral Video: షాకింగ్.. మెరుపు వేగంతో డేగ వేట.. వీడియో చూస్తే చెమటలు పట్టడం ఖాయం..!

Viral Video: భూ ప్రపంచంపై ఉన్న జీవావరణం మొత్తం పరాన్న జీవులే అని చెప్పుకోవాలి. ఎందుకంటే.. శాఖాహార జీవులు మొక్కలు, చెట్లపై ఆధారపడి జీవిస్తే.. మాంసాహార జీవులు తమ..

Viral Video: షాకింగ్.. మెరుపు వేగంతో డేగ వేట.. వీడియో చూస్తే చెమటలు పట్టడం ఖాయం..!
Eagle
Follow us
Shiva Prajapati

|

Updated on: May 02, 2022 | 7:45 AM

Viral Video: భూ ప్రపంచంపై ఉన్న జీవావరణం మొత్తం పరాన్న జీవులే అని చెప్పుకోవాలి. ఎందుకంటే.. శాఖాహార జీవులు మొక్కలు, చెట్లపై ఆధారపడి జీవిస్తే.. మాంసాహార జీవులు తమ కన్నా చిన్న జీవులను చంపి తిని జీవనం సాగిస్తున్నాయి. అయితే, మానవ ప్రపంచ ఎట్లున్నా.. అటవీ ప్రపంచ మాత్రం చాలా భిన్నం. అక్కడ జంతువులు, పక్షుల జీవన విధానమే వేరు. అడవిలో బలమైన జీవులను రాజ్యం అన్నట్లుగా ఉంటుంది. అందుకే అత్యంత శక్తివంతమైన సింహం.. అడవికి రాజుగా గుర్తింపు పొందింది. సింహం, చిరుతపులి, పులి వంటి క్రూరమైన జీవుల వేట అత్యంత భయకరంగా ఉంటుంది. జంతువుల్లో వీటి వేట ఇలా ఉంటే.. పక్షుల్లో అత్యంత ప్రమాదకరమైనవి గద్ద, డేగ. వీటి కన్ను పడితే చాలు.. మరోజీవికి నూకలు చెల్లినట్లే.

గద్ద తన ఆకలిని తీర్చుకునేందుకు చిన్న చిన్న జంతువులు, పక్షులు, చేపలను వేట సాగిస్తుంది. ఆకాశంలో విహరిస్తూ.. తన ఆహారం కోసం వేట సాగిస్తుంది. తన కంటే ఏదైనా కనిపిస్తే చాలు మెరుపు వేగంతో అటాక్ చేసి ఎత్తుకెళ్లిపోతుంది. తాజాగా గద్ద వేటకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే చెమటలు పట్టక మానదు. అప్పటి వరకు ఆకాశంలో ప్రశాంతంగా విహరిస్తున్న గద్ద ఒక్కసారిగా కిందకు వచ్చింది. నీటిలో ఈదుతున్న చేపను ఆకాశం నుంచే పసిగట్టిన గద్ద.. చేపను క్షణాల్లో వేటాడింది. నీటిలో ఉన్న చేపను తన కాళ్లకు ఉన్న పదునైన గోళ్లతో పట్టేసి గాళ్లో ఎత్తుకెళ్లిపోయింది. క్షణ కాలంలో జరిగిన ఈ వేట అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరీ ఇంత భయంకరంగా, వేగంగా వేట సాగిస్తాయా? అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను పీజియన్ కశ్మీర్ అనే పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది.

Also read:

Child care tip: వేసవిలో పిల్లల శరీరం చల్లగా ఉండాలంటే ఈ నూనెతో మసాజ్ చేయండి..!

Viral Video: ఒక్క నీటి చుక్క నిండు ప్రాణాలను కాపాడింది.. గుండెను పిండేస్తున్న వీడియో..!

Trs vs Bjp: బండి సంజయ్‌కి నిజంగా ప్రేమ ఉంటే ఆ పని చేయాలి.. మంత్రి కేటీఆర్ డిమాండ్..