AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat: స్టేడియానికి మోడీ పేరును మారుస్తాం.. రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తాం.. కాంగ్రెస్

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ కావడంతో అధికార, ప్రతిపక్షాలు ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. అధికారం చేపట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుండగా.. ఎలాగైనా గుజరాత్ పీఠాన్ని కైవసం...

Gujarat: స్టేడియానికి మోడీ పేరును మారుస్తాం.. రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తాం.. కాంగ్రెస్
Congress
Ganesh Mudavath
|

Updated on: Nov 13, 2022 | 8:56 AM

Share

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ కావడంతో అధికార, ప్రతిపక్షాలు ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. అధికారం చేపట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుండగా.. ఎలాగైనా గుజరాత్ పీఠాన్ని కైవసం చేసుకోవాలనే ఆలోచనలో ఆప్, కాంగ్రెస్ లు ఉన్నాయి. ఈ పరిస్థితుల నడుమ ప్రచారం జోరు గా కొనసాగుతోంది. ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు పార్టీ నేతలు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అహ్మదాబాద్‌లోని ప్రధాని నరేంద్ర మోడీ స్టేడియం పేరును మారుస్తానని హామీ ఇచ్చింది. ఇది స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే సుమారు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో వివరించారు. మహిళలకు ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్‌ తో పాటు, మోడీ స్టేడియం పేరును సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ స్టేడియంగా మారుస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ విపరీతమైన అవినీతికి పాల్పడుతోందన్న కాంగ్రెస్.. తాము అధికారంలోకి వస్తే గడిచిన 27 సంవత్సరాల్లో జరిగిన అవినీతి ఫిర్యాదులపై విచారణకు ఆదేశిస్తామన్నారు. దోషులపై కేసులు నమోదు చేస్తామని వివరించారు.

మహిళలు, వితంతువులు, వృద్ధులకు నెలకు రూ.2 వేలు పెన్షన్ అందిస్తాం. 3 వేల వరకు ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు ప్రారంభిస్తాం. బాలికలకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్య అందిస్తాం. 3 లక్షల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తాం. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం. నిరుద్యోగ యువకులకు నెలకు రూ.3 వేలు జీవన భృతి, రూ.500 రూపాయలకే సిలిండర్ ఇస్తాం.

ఇవి కూడా చదవండి

– గుజరాత్ అసెంబ్లీ వేళ కాంగ్రెస్ రిలీజ్ చేసిన మేనిఫెస్టో

కాగా.. గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ప్రకటించారు. రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 1న తొలి దశ, డిసెంబర్‌ 2న రెండో దశలో పోలింగ్‌ జరగనుంది. డిసెంబర్ 8 న ఓట్ల లెక్కింపు జరగనుంది. గుజరాత్ అసెంబ్లీలోని మొత్తం 182 స్థానాలున్నాయి. గుజరాత్‌లో 142 జనరల్, 17 ఎస్సీ, 23 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌కు 77 సీట్లు వచ్చాయి. గుజరాత్ 14 వ శాసనసభ పదవీకాలం ఫిబ్రవరి 18, 2023 తో ముగుస్తుంది.

మరిన్నిజాతీయ వార్తల కోసం చూడండి..