AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన రాహుల్ గాంధీ.. కారణం అదేనా?

కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. సీబీఐ డైరెక్టర్ నియామకానికి సంబంధించి పీఎంఓలో నిర్వహించిన కేబినెట్ నియామకాల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, రాహుల్ గాంధీతోపాటు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా కూడా ఉన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన రాహుల్ గాంధీ.. కారణం అదేనా?
Pm Narendra Modi Rahul Gandhi
Balaraju Goud
|

Updated on: May 05, 2025 | 7:39 PM

Share

కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పిఎంఓలో కలిశారు. సీబీఐ డైరెక్టర్ నియామకానికి సంబంధించి పీఎంఓలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, రాహుల్ గాంధీతో పాటు, భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా కూడా ఉన్నారు. CBI డైరెక్టర్‌ను కేబినెట్ నియామకాల కమిటీ (ACC) నియమిస్తుంది.

ఈ ఉన్నత స్థాయి కమిటీలో ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ CBI డైరెక్టర్ పదవికి ఒక పేరును ఆమోదిస్తుంది. ప్రస్తుతం CBI డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలం మే 25తో ముగియనుంది. ఆయన తర్వాత దేశానికి తదుపరి సీబీఐ డైరెక్టర్ ఎవరు అనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏసీసీ సమావేశం జరిగింది.

ప్రవీణ్ సూద్ మే 2023లో సీబీఐ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆ సమయంలో ఆయన కర్ణాటక డీజీపీగా ఉన్నారు. 25 మే 2023న, ఆయన CBI డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో సూద్ సుబోధ్ జైస్వాల్ స్థానంలో వచ్చారు. ప్రవీణ్ సూద్ కర్ణాటక కేడర్ కు చెందిన 1986 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి. సీబీఐ డైరెక్టర్‌గా సూద్ పదవీకాలం మే 25తో ముగియనుంది.

ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ (1946) ప్రకారం CBI డైరెక్టర్ నియమితులవుతారు. ఈ చట్టాన్ని 2013లో మార్చారు. ఈ సవరణ ప్రకారం, సీబీఐ చీఫ్ నియామకానికి ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ సిఫార్సు తప్పనిసరి చేయాల్సి ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ