నటించకండి.. బీజేపీలో చేరండి.. రజనీకి కార్తీ చురక

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి సూపర్‌స్టార్ రజనీకాంత్‌ మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై కాంగ్రెస్‌ నేత, ఎంపీ కార్తీ చిదంబరం తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు రజనీ నటించాల్సిన అవసరం లేదని కార్తీ చిదంబరం ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేసిన కార్తీ.. ‘‘కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు నటించడానికి రజనీకి ఎలాంటి కారణం లేదు. ఆయన […]

నటించకండి.. బీజేపీలో చేరండి.. రజనీకి కార్తీ చురక

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి సూపర్‌స్టార్ రజనీకాంత్‌ మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై కాంగ్రెస్‌ నేత, ఎంపీ కార్తీ చిదంబరం తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు రజనీ నటించాల్సిన అవసరం లేదని కార్తీ చిదంబరం ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేసిన కార్తీ.. ‘‘కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు నటించడానికి రజనీకి ఎలాంటి కారణం లేదు. ఆయన బీజేపీలో చేరచ్చు’’ అని పేర్కొన్నారు.

కాగా సీఏఏపై ఇటీవల స్పందించిన రజనీ.. ఈ విషయంలో కేంద్రానికి తన మద్దతును ఇచ్చారు. సీఏఏ వలన ముస్లింలకు ఎలాంటి ముప్పు లేదని, ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే వారి తరఫున పోరాడే మొదటి వ్యక్తిని తానే అవుతానని రజనీ ప్రకటించారు.

Published On - 7:06 am, Thu, 6 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu