Sukhvinder Singh Sukhu: హిమాచల్‌ సీఎంగా సుఖ్విందర్‌ సుక్కు ప్రమాణం.. హాజరైన ఖర్గే, రాహుల్‌, ప్రియాంక..

|

Dec 11, 2022 | 2:40 PM

హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్‌ సింగ్‌ సుక్కు ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఎంగా ముఖేశ్‌ అగ్నిహోత్రి ప్రమాణం చేశారు. సిమ్లాలో ఆదివారం సుక్కు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది.

Sukhvinder Singh Sukhu: హిమాచల్‌ సీఎంగా సుఖ్విందర్‌ సుక్కు ప్రమాణం.. హాజరైన ఖర్గే, రాహుల్‌, ప్రియాంక..
Sukhvinder Singh Sukhu
Follow us on

హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్‌ సింగ్‌ సుక్కు ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఎంగా ముఖేశ్‌ అగ్నిహోత్రి ప్రమాణం చేశారు. హిమాచల్ సిమ్లాలో ఆదివారం సుక్కు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గేతోపాటు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, పలువురు పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు. ముందుగా సిమ్లాకు చేరుకున్న రాహుల్, ప్రియాంకకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌, సచిన్‌ పైలట్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణస్వీకారానికి ముందు హిమాచల్‌ పీసీసీ చీఫ్‌ ప్రతిభాసింగ్‌ను సుఖ్విందర్‌ సుక్కు మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీలో ఎలాంటి అభిప్రాయబేధాలు లేవని ఆయన స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

సీఎం పదవి కోసం చివరివరకు ప్రయత్నించారు ప్రతిభాసింగ్‌ . అయితే కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆమెకు నచ్చచెప్పడంతో వెనక్కి తగ్గారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతులు నిర్వహించిన సుఖ్విందర్‌కు అనూహ్యంగా సీఎం పదవి దక్కింది. నౌదౌన్‌ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రస్‌కు 40 సీట్లు దక్కాయి. ప్రియాంకగాంధీకి ఇది తొలివిజయంగా చెప్పుకోవచ్చు. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ తరపున అన్నీ తానై నడిపించారు ప్రియాంక. ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ.. తాము వాగ్దానం చేసినవాటిని వీలైనంత త్వరగా అమలు చేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..