Renuka Chowdhury: ప్రధాని మోడీపై రేణుకా చౌదరి పరువు నష్టం కేసు! .. అలా పిలిచినందుకే..
రాజ్యసభ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ప్రధాని మోడీ రామాయణం సీరియల్ గురించి ప్రస్తావించిన క్లిప్‌ను కూడా రేణుకా చౌదరి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
మోడీ పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై.. పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఇప్పుడు రాజకీయ వేడి పెరిగింది. రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2018లో పార్లమెంట్‌లో తనను ‘శూర్పణఖ’ అంటూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ప్రధాని మోడీ పై పరువునష్టం కేసు వేస్తానని చెప్పారు. రాజ్యసభ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ప్రధాని మోడీ రామాయణం సీరియల్ గురించి ప్రస్తావించిన క్లిప్‌ను కూడా రేణుకా చౌదరి పంచుకున్నారు.
This classless megalonaniac referred to me as Surpanakha on the floor of the house.
I will file a defamation case against him. Let’s see how fast courts will act now.. pic.twitter.com/6T0hLdS4YW
— Renuka Chowdhury (@RenukaCCongress) March 23, 2023
పార్లమెంట్‌లో ప్రధాని మోడీ తనను ‘శూర్పణఖ’ అని పిలిచారని రేణుకా చౌదరి ట్వీట్ చేశారు. ఇప్పుడు మోడీ పై పరువు నష్టం కేసు పెడతాను. కోర్టులు ఎంత వేగంగా పనిచేస్తాయో చూద్దామని చెప్పారు రేణుకా చౌదరి.
రేణుక ట్విట్ పై నెటిజన్లు స్పందిస్తూ.. ‘శూర్పణఖ’ అనే పదాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించలేదని, పార్లమెంటులో చేసిన ప్రకటనపై కోర్టును ఆశ్రయించలేరని కాంగ్రెస్ నాయకురాలు రేణుకకు గుర్తు చేశారు.
నిజానికి 2018లో ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభలో మాట్లాడుతున్నారు. ఇంతలో రేణుకా చౌదరి గట్టిగా నవ్వింది. వారి నవ్వుల చప్పుడుతో రాజ్యసభ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. దీనిపై అప్పటి రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు.. రేణుకను అడ్డుకుని మీకేం ఇబ్బంది అని ప్రశ్నించారు. దీనిపై పీఎం మోడీ ఛైర్మన్‌ను అభ్యర్థిస్తూ.. రేణుకా జీని ఏమీ అనవద్దని.. మాట్లాడవద్దని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.. రామాయణం సీరియల్ తర్వాత.. ఈ రోజు అలాంటి నవ్వు వినే అదృష్టం నాకు కలిగిందని అన్నారు.
ఈరోజు పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు కాంగ్రెస్ నిరసన రాహుల్‌ను దోషిగా నిర్ధారించిన తర్వాత.. కోర్టు రాహుల్ గాంధీకి 30 రోజుల సమయం ఇచ్చింది. అయితే కాంగ్రెస్‌తో సహా చాలా మంది ప్రతిపక్ష నాయకులు కోర్టు నిర్ణయంపై నిరసన వ్యక్తం చేసారు. ఎలా ఈ తీర్పునిస్తారు అంటూ ప్రశ్నించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈడీ, సీబీఐ వంటి సంస్థల ద్వారా ఎఫ్‌ఐఆర్‌లు, పరువు నష్టం కేసులు నమోదు చేయడం ద్వారా ప్రభుత్వం ప్రతిపక్ష నేతల గొంతును అణచివేయాలని చూస్తోందని ఆరోపించారు. ఈరోజు పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు కాంగ్రెస్ నిరసన చేపట్టనుంది. దీంతో పాటు పలువురు కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గళం విప్పి రాహుల్ గాంధీకి మద్దతు పలకనున్నాయి. ఇతర ప్రతిపక్ష నేతలతో కూడా సమావేశం కానున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..