ఏంటి ఈ దారుణం.. కూతురికి తండ్రి పోలికలు వచ్చాయని 3 నెలల పాపను చంపిన తల్లి
ఈ మధ్య చాలా మంది చిన్న చిన్న విషయాలకే క్షణికావేశంలో దారుణాలకు పాల్పడుతున్నారు. నవమాసాలు పెంచి, పోషించిన తల్లిదండ్రులపై కొడుకులే దాడులు చేయడం, అలాగే పిల్లలతో కలిసి తల్లి లేదా తండ్రి ఆత్మహత్య చేసుకోవడం ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

ఈ మధ్య చాలా మంది చిన్న చిన్న విషయాలకే క్షణికావేశంలో దారుణాలకు పాల్పడుతున్నారు. నవమాసాలు పెంచి, పోషించిన తల్లిదండ్రులపై కొడుకులే దాడులు చేయడం, అలాగే పిల్లలతో కలిసి తల్లి లేదా తండ్రి ఆత్మహత్య చేసుకోవడం ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే తాజాగా ఓ మహిళ తనకు పుట్టిన కూతురికి తన పోలీకలు రాలేదని 3 నెలల శిశువును హత్య చేసింది. వివరాల్లోకి వెళ్తే్ మహారాష్ట్రలోని నాసిక్ లో ఇటీవల ఓ మహిళ కూతరుకి జన్మిచ్చింది. అయితే ఆ పాపను చూసిన ఆ మహిళ అత్త మామలు, బంధువులు, చుట్టుపక్కల వారందరూ ఆ పాపకు తండ్రి పోలీకలు ఉన్నాయని చర్చించుకునేవారు. అయితే అందరూ ఇలా అనడం ఎందుకో ఆ మహిళకు నచ్చలేదు. అందరూ తన పొలికలు కాకుండా ప్రతిసారి తండ్రి పోలీకలు వచ్చాయని చెప్పడంతో భరించలేక మనస్తాపానికి గురైంది.
చివరికి తన 3 నెలల పసికందు గొంతు కోసి చంపేసింది. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళ ఇంటికి చేరుకున్నారు. పాప మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. ఆ మహిళపై కేసు నమోదు చేసుకున్నారు. కూతురు ఎలా మృతి చెందిందని తల్లిని విచారించారు. ఆమె తడబుడుతూ కంగారుగా సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే తమదైన శైలిలో గట్టిగా విచారించగా అసలు విషయం బయట పెట్టింది. కూతురుని తానే చంపినట్లు నేరాన్ని ఒప్పుకోవడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి తీసుకెళ్లారు.
