Rahul Gandhi: ఐదోరోజుకు భారత్ జోడో యాత్ర.. కేరళలోకి ఎంట్రీ ఇచ్చిన రాహుల్ పాదయాత్ర..
Bharat Jodo yatra: రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర కేరళలో జోరందుకుంది. ఐదో రోజు పాదయాత్రలో మరింత ఉత్సహంగా కన్పించారు రాహుల్. చేనేత కార్మికులు , ఉపాధి హామీ కూలీలు.. చిరు వ్యాపారులతో మాట్లాడుతూ రాహుల్ తన యాత్రను కొనసాగిస్తున్నారు.
కేరళలో రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర జోరుగా కొనసాగుతోంది. రాహుల్ పాదయాత్ర ఐదో రోజుకు చేరుకుంది. కేరళ లోని పారసాలలో ప్రారంభమైన యాత్ర త్రివేండ్రం శివార్లకు చేరుకుంది. నియ్యతికర ప్రాంతంలో రాహుల్ పాదయాత్ర జరుగుతోంది. ఈ ప్రాంతంలో చేనేత కార్మికులు ఉంటారు. చేనేత కార్మికులు కుటుంబాలతో మాట్లాడారు రాహల్. వాళ్ల కష్టాలు తెలుసుకున్నారు. భారత్ జోడో యాత్ర కేరళలో 19 రోజుల పాటు కొనసాగుతుంది. కేరళ 456 కిలోమీటర్ల మేర భారత్ జోడో యాత్ర జరుగుతుంది. అయితే ఆదివారం రాత్రి రాహుల్‌గాంధీ కంటేనర్‌లో బస చేయడం లేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తోటి కార్యకర్తలతో కలిసి స్కూల్లో బస చేస్తారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. రాహుల్‌గాంధీ పాదయాత్రను అడ్డుకుంటామని SFI కార్యకర్తలు ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాహుల్‌గాంధీకి కేరళ కాంగ్రెస్ నేతలు సుధాకరన్ , అసెంబ్లీలో విపక్ష నేత సతీషన్ ఘనస్వాగతం పలింకారు.
నియ్యతికరలో మాధవీమందిరాన్ని సందర్శించారు రాహుల్. త్రివేండ్రం శివార్ల లోని నేమం దగ్గర రాహుల్ బస చేస్తారు. త్రివేండ్రం శివార్ల నుంచి నీలాంబూర్ వరకు రాహుల్ పాదయాత్ర జరుగుతుంది. పాదయాత్ర సందర్భంగా రోడ్డుపై ఉన్న హోటళ్ల లోనే రాహుల్ టీ తాగుతున్నారు. స్థానిక వ్యాపారులతో ఆయన ముచ్చటిస్తున్నారు. శనివారం రాహుల్ పాదయాత్ర కేరళలో ప్రవేశించకముందు తమిళనాడులో సరదా సన్నివేశాలు కన్పించాయి. కన్యాకుమారి జిల్లా మార్తాండం ప్రాంతంలో భోజన విరామం తీసుకున్నారు రాహుల్.
#WATCH | Congress leader Rahul Gandhi starts Bharat Jodo yatra from Neyyattinkara in Kerala to end it at Nemam in Tamil Nadu pic.twitter.com/XSYN4BcxUE
— ANI (@ANI) September 11, 2022
ఈ సందర్భంగా ఉపాధి హామీ మహిళా కూలీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారి సంపాదన, కుటుంబ స్థితిగతులు, తీసుకురావాల్సిన మార్పు తదితర అంశాలపై ముచ్చటించారు. మాటల మధ్యలో ఓ మహిళ రాహుల్ పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చారు. ‘మీరు తమిళనాడును బాగా ప్రేమిస్తారని తెలుసు. తమిళ యువతితో మీకు వివాహం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం’’ అని ఓ మహిళ రాహుల్ గాంధీతో అన్నారు.
ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ స్వయంగా ట్వీట్ చేశారు. వాళ్లతో మాట్లాడుతున్న సమయంలో రాహుల్ చాలా ఉత్సాహంగా కనిపించినట్లు ఆయన చెప్పారు. ఆ సన్నివేశానికి అద్దంపట్టే రెండు ఫొటోలను తన ట్వీట్‌కు జత చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం