Sonali Phogat Murder Case: హర్యానా సర్కార్‌కు ఈనెల 23 వరకు డెడ్‌లైన్.. సోనాలి ఫోగట్ మర్డర్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్..
టిక్‌టాక్ స్టార్ సోనాలి ఫోగట్ మర్డర్ కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని ఖాప్ మహాపంచాయత్ డిమాండ్ చేసింది. ఈనెల 23 లోగా సీబీఐ దర్యాప్తుకు ఆదేశించకపోతే భారీ ఉద్యమం చేపడుతామని హర్యానా ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించింది.
టిక్‌టాక్ స్టార్, బీజేపీ నేత సోనాలి ఫోగట్ మర్డర్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్ పెరుగుతోంది. హర్యానా లోని ఆమె స్వస్థలం హిస్సార్‌లో ఖాప్ మహాపంచాయత్ నిర్వహించారు. వెంటనే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని జాట్ పెద్దలు కోరారు. సోనాలి ఫోగట్ మర్డర్ కేసులో రాజకీయ కుట్ర ఉందని , అందుకే సీబీఐకి అప్పగించాలని ఖాప్ మహాపంచాయత్ డిమాండ్ చేసింది. ఈనెల 23 వరకు హర్యానా ప్రభుత్వానికి ఖాప్ పంచాయత్ డెడ్‌లైన్ విధించింది. లేదంటే మరోసారి సమావేశం నిర్వహించిన తదుపరి కార్యాచారణ ప్రకటిస్తామని తెలిపింది. సోనాలి ఫోగట్ మర్డర్ కేసును సీబీఐకి అప్పగించాలని కుటుంబసభ్యులు ముందు నుంచి డిమాండ్ చేస్తున్నారు. గోవా పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని స్పష్టం చేస్తున్నారు. 15 రోజులైనప్పటికి గోవా పోలీసుల దర్యాప్తులో ఇప్పటివరకు ఏమి తేలలేదని విమర్శించారు. దర్యాప్తు పేరుతో గోవా పోలీసులు టైంపాస్ చేస్తున్నారని విమర్శించారు.
ఖాప్ పంచాయత్ డెడ్‌లైన్‌పై హర్యానా ప్రభుత్వం స్పందించింది. సోనాలి ఫోగట్ కేసులో తమ పోలీసులు చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారని గోవా ప్రభుత్వం తమకు తెలిపిందన్నారు సీఎం మనోహర్ లాల్ కట్టర్ . గోవా లోని పబ్‌లో హత్యకు గురయ్యారు సోనాలి ఫోగట్. నీళ్లలో MDMA డ్రగ్స్‌ను కలిపి సోనాలి ఫోగట్‌తో తాగించారని పోలీసులు తెలిపారు. సోనాలి ఫోగట్ మర్డర్ కేసులో ఆమె ఇద్దరు పీఏలతో పాటు ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.
సోనాలి ఫోగట్ బలవంతంగా డ్రగ్స్ ఇచ్చినట్లు పబ్ సిసి టీవీ ఫుటేజ్ లో కనిపించింది. అరెస్టయిన వారిలో ఆమె ఇద్దరు పీఏలు సుఖ్విందర్‌సింగ్ , సుధీర్ సాగ్వాన్ కూడా ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం