AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ ధర్నా భగ్నం.. పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ

లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీట్ పేపర్ లీక్‌ను నిరసిస్తూ సోమవారం సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన చలో పార్లమెంట్ కార్యక్రమంలో హింసాత్మకంగా మారడంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్నారు.

కాంగ్రెస్ ధర్నా భగ్నం.. పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ
Rahul Gandhi
SN Pasha
|

Updated on: Jul 21, 2026 | 6:55 PM

Share

నీట్ పేపర్ లీక్ అంశంపై దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. సోమవారం కాక్రోజ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఛలో పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారంటూ ఆరోపిస్తూ, మంగళవారం కాంగ్రెస్ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోదీ నివాసం సమీపంలో ధర్నాకు దిగారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ ప్రియాంకా గాంధీతో పాటు పలువురు నేతలు నిరసనలో పాల్గొన్నారు. కొద్దిసేపటి తర్వాత కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అక్కడికి చేరుకుని కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా తమ ఐదు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తేనే నిరసన విరమిస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అనంతరం జితేంద్ర సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. తదుపరి పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు నిరసన ప్రాంతానికి చేరుకుని ధర్నాను విరమింపజేసే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసనలో పాల్గొన్న పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను కూడా అక్కడి నుంచి తరలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆలూ-రవ్వ స్నాక్.. ఒక్కసారి రుచి చూస్తే ఇడ్లీ.. దోస.. మర్చిపోతారు!
ఆలూ-రవ్వ స్నాక్.. ఒక్కసారి రుచి చూస్తే ఇడ్లీ.. దోస.. మర్చిపోతారు!
బిగ్ బాస్ అంటే ఇష్టం.. కానీ ఛాన్స్ వస్తే మాత్రం వెళ్ళాను..
బిగ్ బాస్ అంటే ఇష్టం.. కానీ ఛాన్స్ వస్తే మాత్రం వెళ్ళాను..
దోస.. ఇడ్లీ.. బోర్ కొడితే అప్పటికప్పుడు ఈ ఉల్లి బోండా ట్రై చేయండి
దోస.. ఇడ్లీ.. బోర్ కొడితే అప్పటికప్పుడు ఈ ఉల్లి బోండా ట్రై చేయండి
దోశను ఇంగ్లీషులో ఏమంటారు..? 99శాతం మందికి తెలియని అసలు నిజం..
దోశను ఇంగ్లీషులో ఏమంటారు..? 99శాతం మందికి తెలియని అసలు నిజం..
వర్షాకాలంలో కోడి కూరను ఇలా తింటే జలుబు, దగ్గు పారిపోతాయ్..
వర్షాకాలంలో కోడి కూరను ఇలా తింటే జలుబు, దగ్గు పారిపోతాయ్..
లిఫ్ట్‌కు - గోడ‌కు మ‌ధ్య వేలాడుతుండ‌గా హైడ్రా ఆప‌రేష‌న్‌
లిఫ్ట్‌కు - గోడ‌కు మ‌ధ్య వేలాడుతుండ‌గా హైడ్రా ఆప‌రేష‌న్‌
పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టుకు గుడ్ న్యూస్
పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టుకు గుడ్ న్యూస్
అలాంటి బట్టలువేసుకొని ఫైట్ సీన్ చేయమన్నారు..
అలాంటి బట్టలువేసుకొని ఫైట్ సీన్ చేయమన్నారు..
76 ఏళ్ల వయసులో ఇంత యాక్టివ్ గా ఎలా? మోదీ హెల్త్ సీక్రెట్ ఇదే
76 ఏళ్ల వయసులో ఇంత యాక్టివ్ గా ఎలా? మోదీ హెల్త్ సీక్రెట్ ఇదే
తిరుమల వెళ్తున్నారా..? ఇది తెలియకపోతే ఇబ్బందులు తప్పవు
తిరుమల వెళ్తున్నారా..? ఇది తెలియకపోతే ఇబ్బందులు తప్పవు