Comedian Munawar Arrest: హిందూ దేవుళ్లు, అమిత్‌ షాపై కామెంట్ చేసిన ప్రముఖ కమెడియన్ అరెస్ట్.. పలు కేసులు నమోదు

Comedian Munawar Arrest: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, హిందూ దేవుళ్లపై కామెంట్ చేసిన ముంబైకి చెందిన ఓ కమెడియన్, అతడి

Comedian Munawar Arrest: హిందూ దేవుళ్లు, అమిత్‌ షాపై కామెంట్ చేసిన ప్రముఖ కమెడియన్ అరెస్ట్.. పలు కేసులు నమోదు
Follow us
uppula Raju

|

Updated on: Jan 03, 2021 | 10:37 AM

Comedian Munawar Arrest: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, హిందూ దేవుళ్లపై కామెంట్ చేసిన ముంబైకి చెందిన ఓ కమెడియన్, అతడి నలుగురి స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్‌ జునాగఢ్‌కు చెందిన మునవర్ ఫారుకి ముంబైలో నివాసం ఉంటూ స్టాండప్ కామెడీలతో కమెడీయన్‌గా చెలామణి అవుతున్నారు. అయితే మధ్యప్రదేశ్‌ దుఖన్ కు చెందిన 56 ఏరియాలో స్టాండప్ కామెడీ జరిగింది. ఆ షో జరిగే సమయంలో కమెడియన్ మునవర్ ఫారుకి హిందూ దేవుళ్లపై, అమిత్ షాపై కామెంట్స్ చేశారు. ఐపీసీ సెక్షన్ 295-ఏ, సెక్షన్ -269 కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. దీనిపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మలిని లక్ష్మణ్ సింగ్ గౌర్ కుమారుడు ఏకలవ్య సింగ్ కౌర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితులను అరెస్ట్ చేసి ఐపీసీ సెక్షన్ 295-ఏ, సెక్షన్ -269 కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.