సింఘు బోర్డర్ లో కంటెయినర్ ట్రక్ ని ఇంటిగా మార్చేసిన రైతు, క్రియేటివిటీ అంటే ఇదే ! అన్ని సౌకర్యాలూ ఉన్నాయి మరి

సింఘు బోర్డర్లో ఆందోళన చేస్తున్న అన్నదాతల్లో ఓ రైతు తన సృజనాత్మకతను చాటుకున్నాడు. పంజాబ్..జలంధర్ కు చెందిన హర్ ప్రీత్ సింగ్ మట్టూ..

సింఘు బోర్డర్ లో కంటెయినర్ ట్రక్ ని ఇంటిగా మార్చేసిన రైతు, క్రియేటివిటీ అంటే ఇదే ! అన్ని సౌకర్యాలూ ఉన్నాయి మరి
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 03, 2021 | 10:03 AM

Farmers Protest:సింఘు బోర్డర్లో ఆందోళన చేస్తున్న అన్నదాతల్లో ఓ రైతు తన సృజనాత్మకతను చాటుకున్నాడు. పంజాబ్..జలంధర్ కు చెందిన హర్ ప్రీత్ సింగ్ మట్టూ అనే ఈయన ఇక్కడ తన కంటెయినర్ ట్రక్ ని చక్కని మినీ హౌస్ గా మార్చేశాడు. ఇందులో సోఫా, బెడ్, టీవీ, టాయిలెట్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. అమెరికాలో ఉన్న తన సోదరుని సూచనపై డిసెంబరు 2 న తానిక్కడికి వచ్చానని, ఇతర రైతులకు సాయం చేయాలని అతడు కోరాడని మట్టూ చెప్పాడు. ఇక్కడికి వచ్చాక నేను హొమ్ సిక్ గా ఫీలయ్యాను, ఇంటిమీద బెంగ పట్టుకుంది. దాంతో ఇక్కడే తాత్కాలికంగా ఇంటిని నిర్మించుకుంటే పోలా అని భావించాను..అంతే…. నా కంటెయినర్ ట్రక్ ని ఇలా ఛేంజ్ చేసేశా అని వెల్లడించాడు. ఇందుకు తనకు తన స్నేహితులు సాయం చేశారని, ఒకటిన్నర రోజుల్లో ఇది తయారైందని చెప్పాడు. అన్నట్టు ఇక్కడికి వచ్ఛే వారికి మట్టూ ప్రత్యేకంగా చేసిన టీ కూడా అందిస్తున్నాడు. ఇందుకు ఇతని భార్య, కొడుకు, మేనల్లుడు, సుమారు 90 మంది పనివాళ్ళు సహాయపడుతున్నారట.. రోజుకు సుమారు పది వేలమందికి ఈయన టీ సర్ప్ చేస్తున్నాడు. మట్టూ క్రియేటివిటీ పలువురిని ఆకట్టుకుంటోంది.

Read More:

ఏపీ ప్రయాణికులకు శుభవార్త..హైదరాబాద్ నుంచి విజయవాడకు సంక్రాంతి ప్రత్యేక విమానాలు

దేశంలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం.. పలు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న మహమ్మారి.. కొనసాగుతున్న పరిశోధనలు..

Drunken drive cases: అర్థరాత్రి మహానగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే..?