Coimbatore Spiderman: 15 అడుగుల గోడ దూకి కేవలం రూ.లక్ష విలువైన నగలు చోరీ.. ఈ దొంగ స్టోరీ విని కన్నీళ్లు పెట్టుకున్న పోలీసులు
35 అడుగుల ఎత్తైన గోడ దూకి, ఎత్తైన భవనం మూడవ అంతస్తులోకి మెట్లు లేకుండా స్పైడర్ మ్యాన్ మాదిరి చేరుకున్నాడు ఓ దొంగ. జ్యువెలరీ షోరూంలోని సేఫ్‌లో భధ్రపరిచి ఉన్న కోట్లాది రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయి. అయితే వచ్చిన దొంగ అన్ని నగలు తీసుకోకుండా కేవలం అవసరమైన నగలు మాత్రమే తీసుకుంటానని ముందే చెప్పాడు. అన్నమాట ప్రకారంగానే కేవలం లక్ష విలువైన నగలు మాత్రమే దోచుకుని వెళ్లిపోయాడు. అయితే చోరీ అనంతరం అతను జ్యువెల్లరీ షాప్‌లోనే బట్టలు కూడా..

కోయంబత్తూర్, డిసెంబర్ 17: 35 అడుగుల ఎత్తైన గోడ దూకి, ఎత్తైన భవనం మూడవ అంతస్తులోకి మెట్లు లేకుండా స్పైడర్ మ్యాన్ మాదిరి చేరుకున్నాడు ఓ దొంగ. జ్యువెలరీ షోరూంలోని సేఫ్‌లో భధ్రపరిచి ఉన్న కోట్లాది రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయి. అయితే వచ్చిన దొంగ అన్ని నగలు తీసుకోకుండా కేవలం అవసరమైన నగలు మాత్రమే తీసుకుంటానని ముందే చెప్పాడు. అన్నమాట ప్రకారంగానే కేవలం లక్ష విలువైన నగలు మాత్రమే దోచుకుని వెళ్లిపోయాడు. అయితే చోరీ అనంతరం అతను జ్యువెల్లరీ షాప్‌లోనే బట్టలు కూడా మార్చుకున్నాడు. అదే అతను చేసిన అతిపెద్ద పొరపాటని అగంతకుడు గుర్తించలేకపోయాడు.
హడావిడిలో అతని చొక్కా జేబులో బస్సు టిక్కెట్టు మర్చిపోయాడు. ఆ టికెట్లు ద్వారా పోలీసులు కేసును ఛేదించారు. చోరీ అనంతరం జ్యువెల్లరీ షోరూం యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి వెతుకులాట ప్రారంభించాయి. మొత్తం 47 మంది పోలీసులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. 350 సీసీటీవీ ఫుటేజీలను తనిఖీ చేశారు. చోరీ అనంతరం నిందితుడు ఆనమలైలోని తన స్నేహితుడి ఇంటి వైపు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనబడింది. పోలీసు బృందం అక్కడికి చేరుకోగానే 15 అడుగుల ఎత్తైన గోడ దూకి పరారయ్యాడు. పోలీసులు అతన్ని పట్టుకోలేకపోయారు. కానీ అతని స్నేహితుడి ద్వారా నిందితుడి పూర్తి వివరాలు పోలీసుల చేతిలోకి వచ్చాయి.
నిందితుడి పేరు విజయ్ మునిరత్నం (26). తమిళనాడు ధర్మపురి జిల్లా హరూర్ సమీపంలోని దేవారెడ్డియూర్ నివాసి. అతనిపై ఇప్పటికే నాలుగు దొంగతనం కేసులు నమోదయ్యాయి. బైక్ కేసుకు సంబంధించి మరో పోలీసు బృందం అతని ఇంటికి వెళ్లగా వెళ్లి చోరీకి గురైన ప్రధాన నిందితుడు విజయ్ పరారయ్యాడు. చోరీకి గురైన నగలను 24 గంటల వ్యవధిలోనే స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో చురుకైన పాత్ర పోషించినందుకు విజయ్ భార్య నర్మదను అరెస్ట్ చేశారు. దీంతో ఆమె తన మూడు నెలల కుమార్తెతో జైలుకు వెళ్లింది.
డిప్యూటీ కమిషనర్ జి చాందిష్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్ మునిరత్నం పోలీసులకు దొరక్కుండా ధర్మపురి అడవుల్లో దాక్కున్నాడు. అతని మొబైల్ పగలగొట్టడంతో పోలీసులు దాని లొకేషన్‌ను కనుగొనలేకపోయారు. అయితే పోలీసు బృందాలు అతని బంధువులు, స్నేహితులపై నిఘా ఉంచాయి. అతను తన బంధువుల్లో ఒకరికి ఫోన్ చేశాడు. చెన్నైలో అతడి లొకేషన్‌ను పోలీసులు ట్రేస్ చేశారు. వెంటనే అప్రమత్తమైన కోయంబత్తూరు పోలీసులు లొకేషన్‌కు వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన సుమారు రెండు వారాల తర్వాత ఎట్టకేలకు నిందితుడు పట్టుబడ్డాడు. విచారణలో విజయ్ దొంగతనానికి గల కారణాన్ని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇంటి అద్దె చెల్లించడానికి లక్ష రూపాయలు కావాలని, బంధువులను అడిగానని వారు ఇవ్వక పోవడంతో చోరీకి పాల్పడ్డానని చెప్పాడు. రెక్కీ నిర్వహించగా షోరూమ్ మూడో అంతస్థులో ఆభరణాలు ఇంచినట్లు తెలిసిందన్నాడు. అందుకోసం 14 రోజుల పాటు సాధన చేశానని చెప్పాడు. రెండు గోడల మధ్య గోడను ఎక్కి లోపలికి ప్రవేశించి, తనకు అవసరమైన మేరకు కేవలం లక్ష విలువైన నగలను మాత్రమే చోరీ చేసినట్లు నేరం అంగీకరించాడు. నిజాయితీ పరుడైనా ఈ దొంగ కథ విని పోలీసులు ఆశ్చర్యపోయారు. నేరం రుజువైతే విజయ్‌కు గరిష్టంగా ఆరేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.