CM KCR: నేడు మహారాష్ట్రలో సీఎం కేసీఆర్‌ పర్యటన.. సరిహద్దు జిల్లాలే టార్గెట్‌గా భారీ బహిరంగ సభ

|

Mar 26, 2023 | 6:31 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు (మార్చి 26) మహారాష్ట్రలో పర్యటించనున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని విస్తరించడమే లక్ష్యంగా కంధార్‌ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు

CM KCR: నేడు మహారాష్ట్రలో సీఎం కేసీఆర్‌ పర్యటన.. సరిహద్దు జిల్లాలే టార్గెట్‌గా భారీ బహిరంగ సభ
Cm Kcr
Follow us on

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు (మార్చి 26) మహారాష్ట్రలో పర్యటించనున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని విస్తరించడమే లక్ష్యంగా కంధార్‌ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందుకోసం బైల్‌ బజార్‌లో ఏకంగా 15 ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ నినాదంతోనే మహారాష్ట్ర ప్రజలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా కేసీఆర్‌ ఈ పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా లోహా పట్టణంలో ఎటు చూసినా బీఆర్‌ఎస్‌ బ్యానర్లు, హోర్డింగులే దర్శనమిస్తున్నాయి. కాగా నాందేడ్‌లో ఇప్పటికే కేసీఆర్ సభ నిర్వహించారు. ఈసారి లోహలో పార్టీ విస్తరణ కోసం ఈ సభ జరుగుతోంది. ఇవాళ్టి పబ్లిక్‌ మీటింగ్‌కి  సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత హాజరవుతున్నారు.

కాగా ఉమ్మడి నిజామాబాద్‌, ఆదిలాబాద్‌కి చెందిన కొందరు పార్టీ నేతలు వారం రోజులుగా అక్కడే ఉండి సభ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. డిజిటల్‌ ప్రచారంతోపాటు హోర్డింగులతో తమ విధానాల్ని వివరించే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తోంది బీఆర్‌ఎస్‌. తెలంగాణలో రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాల్ని వివరిస్తూ.. మహారాష్ట్రలోనూ పాగా వేసే ఉద్దేశంతో ఈ సభలు నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..