CM KCR: రైతు పోరాట స్ఫూర్తికి సలాం చేస్తున్నా.. అమరులైన జవాన్ల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం

రైతులకు ఉచిత కరెంట్‌ ఇవ్వకుండా కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. పొలాల్లో కరెంట్‌ మీటర్లు బిగించాలని ఒత్తిడి చేస్తోందని విమర్శించారు. ప్రాణం పోయినా సరే..

CM KCR: రైతు పోరాట స్ఫూర్తికి సలాం చేస్తున్నా.. అమరులైన జవాన్ల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం
Cm Kcr
Follow us
Sanjay Kasula

|

Updated on: May 22, 2022 | 6:01 PM

ఏదైనా ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర వేస్తుందని బీజేపీని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు(CM KCR) విమర్శించారు. చండీఘడ్‌ పర్యటనలో బీజేపీపై విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్‌. రైతులకు ఉచిత కరెంట్‌ ఇవ్వకుండా కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. పొలాల్లో కరెంట్‌ మీటర్లు బిగించాలని ఒత్తిడి చేస్తోందని విమర్శించారు. ప్రాణం పోయినా సరే మీటర్లు పెట్టేది లేదని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినట్టు గుర్తు చేశారు.  స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల అయినప్పటికి రైతుల కష్టాలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయన్నారు సీఎం కేసీఆర్‌. రైతులకు మేలు చేయాలని ఎవరైనా సీఎం ప్రయత్నిస్తే కేంద్రం అడ్డుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన పంజాబ్‌ రైతులకు బీజేపీ దేశద్రోహులుగా, ఖలిస్తాన్‌ ఉగ్రవాదులుగా చిత్రీకరించిందన్నారు. రైతుల ఉద్యమం యూపీ , పంజాబ్‌ , హర్యానా , ఢిల్లీ రాష్ట్రాలకే కాదు దేశవ్యాప్తంగా విస్తరించాలని రైతు సంఘాలకు పిలుపునిచ్చారు. గాల్వన్‌లోయ ఘర్షణలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆర్థికసాయం అందించారు సీఎం కేసీఆర్.

పంజాబ్ రైతు పోరాట స్ఫూర్తికి సలాం చేస్తున్నాని అన్నారు. దేశ చరిత్రలో పంజాబ్‌ రైతులు రెండు గొప్ప పోరాటాలు చేశారని ప్రశంసించారు. ఎందరో వీరులు ప్రాణాలు అర్పించి స్వాతంత్య్రం సాధించారని.. హరితవిప్లవంతో పంజాబ్‌ రైతులు దేశం ఆకలిని తీర్చారని అన్నారు. సాగుచట్టాలు రద్దు చేయించి వ్యవసాయాన్ని కాపాడారని అన్నారు.కేంద్ర సర్కార్‌ వ్యవసాయంపై ఇప్పటికీ ఆంక్షలు విధిస్తోంది.

ఇది సంతోషించే సమయం కాదు.. విచారించాల్సిన అంశమన్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని ఏళ్ళు గడిచినా దేశం ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరు..? దీని గురించి మనమంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది.