CM Kejriwal: ఢిల్లీలోని స్టేడియాల‌న్నింటినీ జైళ్లుగా మార్చేశారు.. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన ఢిల్లీ సీఎం..

కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విరుచుకుప‌డ్డారు. ఆ స‌మ‌యంలో ఢిల్లీలోని స్టేడియాల‌న్నింటినీ జైళ్ల‌లాగా మార్చేసింద‌ని.. రైతుల‌ను ఇబ్బందుల‌కు గురి చేశార‌ని సీఎం కేజ్రీవాల్ గుర్తు చేసుకున్నారు. చండీగ‌ఢ్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో రైతు...

CM Kejriwal: ఢిల్లీలోని స్టేడియాల‌న్నింటినీ జైళ్లుగా మార్చేశారు..  కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన ఢిల్లీ సీఎం..
Kejriwal
Follow us
Sanjay Kasula

|

Updated on: May 22, 2022 | 8:01 PM

సాగు చట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతు ఆందోళన స‌మ‌యంలో కేంద్రం వ్య‌వ‌హ‌రించిన తీరుపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విరుచుకుప‌డ్డారు. ఆ స‌మ‌యంలో ఢిల్లీలోని స్టేడియాల‌న్నింటినీ జైళ్ల‌లాగా మార్చేసింద‌ని.. రైతుల‌ను ఇబ్బందుల‌కు గురి చేశార‌ని సీఎం కేజ్రీవాల్ గుర్తు చేసుకున్నారు. చండీగ‌ఢ్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో రైతు ఉద్య‌మంలో మ‌ర‌ణించిన రైతు కుటుంబాల‌ను, గాల్వాన్ స‌రిహ‌ద్దు ఘ‌ర్ష‌ణ‌ల్లో అమ‌రులైన సైనిక కుటుంబాల‌ను సీఎం కేసీఆర్ తో కలిసి సీఎం కేజ్రీవాల్ ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా 600 కుటుంబాల‌కు 3 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక స‌హాయం అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… నేను కూడా రైతు ఉద్య‌మంలో పాల్గొన్నా. నా విష‌యంలో కూడా అచ్చు ఇలాగే జ‌రిగింది. న‌న్ను కూడా స్టేడియంలో నిర్బంధించారు. కొన్ని రోజుల పాటు నేను కూడా స్టేడియంలోనే వున్నాను. రైతు ఉద్య‌మాన్ని అణ‌చేయ‌డానికి ఇదో ర‌క‌మైన ఎత్తుగ‌డ అని నాకు అప్పుడే అర్థ‌మైంది అని కేజ్రీవాల్ వివ‌రించారు.

రైతు ఉద్య‌మం కేవ‌లం స్టేడియాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంద‌న్న వాద‌న‌లు కూడా అప్ప‌ట్లో వ‌చ్చాయ‌ని, వాటిని నిర్ద్వ‌ద్వంగా తోసిపుచ్చాన‌ని కేజ్రీవాల్ గుర్తు చేసుకున్నారు. స్టేడియాల‌ను జైళ్ల‌గా మార్చ‌నీయ‌మ‌ని, దానిని అడ్డుకొని తీరుతామ‌ని చెప్పామ‌న్నారు. ఆ స‌మ‌యంలో చాలా కోపం వ‌చ్చింద‌ని, రైతుల‌కు అండ‌గా నిలిచామ‌ని కేజ్రీవాల్ గుర్తు చేసుకున్నారు.

ఇదిలావుంటే.. చండీఘడ్‌ పర్యటనలో బీజేపీపై విరుచుకుపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. రైతులకు ఉచిత కరెంట్‌ ఇవ్వకుండా కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. పొలాల్లో కరెంట్‌ మీటర్లు బిగించాలని ఒత్తిడి చేస్తోందని విమర్శించారు ప్రాణం పోయినా సరే మీటర్లు పెట్టేది లేదని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినట్టు చెప్పారు.  స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల అయినప్పటికి రైతుల కష్టాలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయన్నారు కేసీఆర్‌. రైతులకు మేలు చేయాలని ఎవరైనా సీఎం ప్రయత్నిస్తే కేంద్రం అడ్డుకుంటోందని విమర్శించారు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన పంజాబ్‌ రైతులకు బీజేపీ దేశద్రోహులుగా , ఖలిస్తాన్‌ ఉగ్రవాదులుగా చిత్రీకరించిందన్నారు కేసీఆర్‌. రైతుల ఉద్యమం యూపీ , పంజాబ్‌ , హర్యానా , ఢిల్లీ రాష్ట్రాలకే కాదు దేశవ్యాప్తంగా విస్తరించాలని రైతు సంఘాలకు పిలుపునిచ్చారు కేసీఆర్‌.

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పెళ్లి మూవీ హీరో.
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పెళ్లి మూవీ హీరో.
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
బాదం నూనెను సరిగ్గా ఇలా వాడితే.. చెప్పలేనన్ని ఉపయోగాలు..
బాదం నూనెను సరిగ్గా ఇలా వాడితే.. చెప్పలేనన్ని ఉపయోగాలు..
నటి రోజా కూతురిని చూశారా? సినిమాల్లోకి రాకుండానే అవార్డులు
నటి రోజా కూతురిని చూశారా? సినిమాల్లోకి రాకుండానే అవార్డులు
ఏడాది చివర్లో ముఖేష్ అంబానీకి బ్యాడ్ న్యూస్.. ఏంటో తెలుసా?
ఏడాది చివర్లో ముఖేష్ అంబానీకి బ్యాడ్ న్యూస్.. ఏంటో తెలుసా?
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..
పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..
పార్శల్‌లో డెడీ బాడీ.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన పోలీసులు
పార్శల్‌లో డెడీ బాడీ.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన పోలీసులు
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో