మానవ తప్పిదాలతో వాతావరణంలో మార్పులు.. రికార్డు స్థాయిలో అధిక ఉష్ణోగ్రతలు
ర్బన ఉద్గారాల తీవ్రత ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా కనిపిస్తోంది. ఇక మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలోని పరిస్థితి కాస్త మెరుగ్గా కనబడుతుంది. ఇదిలా ఉండగా.. 2023లో జూన్ నుంచి ఆగస్టు వరకు.. ఈ మూడు నెలల కాలంలో ప్రపంచంలో అత్యంత వేడి సీజన్‌గా నమోదైనట్లు అమెరికాకు చెందిన వాతావరణ శాస్త్రవేత్తలు గుర్తించారు.

మానవుడు చేస్తున్న తప్పిదాల వల్ల వాతావరణంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే కర్బన ఉద్గారాల తీవ్రత ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా కనిపిస్తోంది. ఇక మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలోని పరిస్థితి కాస్త మెరుగ్గా కనబడుతుంది. ఇదిలా ఉండగా.. 2023లో జూన్ నుంచి ఆగస్టు వరకు.. ఈ మూడు నెలల కాలంలో ప్రపంచంలో అత్యంత వేడి సీజన్‌గా నమోదైనట్లు అమెరికాకు చెందిన వాతావరణ శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే పరిశోధకులతో కూడిన స్వతంత్ర సంస్థ క్లైమేట్ సెంట్రల్ అధ్యయన నివేదికలో పలు విషయాలను వెల్లడించింది. పలు దేశాల్లో అయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు పేర్కొంది.
ఇదిలా ఉండగా రోజువారి ఉష్ణోగ్రతలు.. క్లైమెట్ షిఫ్ట్ ఇండెక్స్.. స్థాయిల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 202 దేశాల్లో ఈ సంస్థ అధ్యయనం చేసింది. ఈ వాతావరణ మార్పుల ప్రభావం వల్ల భారత్‌లో జూన్ నుంచి ఆగస్టు సీజన్‌లో 27 రోజులు సీఎస్‌ఐ స్థాయి 3 గా నమోదైనట్లు పేర్కొంది. అలాగే 1991 నుంచి 2000 సగటు ఉష్ణోగ్రతతో పోలీస్తే.. ఈ సీజన్‌లో 0.6 డిగ్రీలు పెరిగినట్లు వివరించింది. అభివృద్ధి పేరిట అత్యధిక స్థాయిలో ఉన్నటువంటి కర్బన ఉద్గారాలు విడుదల చేసే దేశాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణం మార్పులకు లోనవుతున్నట్లు పేర్కొంది. అలాగే అధిక స్థాయిలో బొగ్గును మండించడం.. ఎక్కువగా ఇంధనాన్ని వినియోగించడం.. అలాగే గ్యాస్‌ను కూడా వాడటంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించుకున్నట్లైతే భవిష్యత్తులో సీఎస్‌ఐ సూచీస్థాయి.. ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని.. క్లైమెట్ సెంట్రల్ హెచ్చరికలు చేసింది.
ఇదిలా ఉండగా.. వాతావరణ మార్పుల వల్ల ఇండియాలో ఖరీఫ్ సీజన్‌లో చాలా రోజుల వరకు పొడి వాతావరణం రికార్డు అయ్యింది. అలాగే మరోవైపు.. ఒకటి, రెండు రోజుల్లో సీజన్ మొత్తం వర్షపాతం భర్తీచేసేలా అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇదిలా ఉండగా దేశంలోని ఈ సంవత్సరం జూన్-ఆగస్టు సీజన్ ఉష్ణోగ్రతపై సంస్థ అధ్యయనం చేసింది. ఇక దేశవ్యాప్తంగా సగటున 27 రోజులు సీఎస్‌ఐ స్థాయి 3 తీవ్రతతో ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నట్లు పేర్కొన్నాయి. కేరళ, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో చూసుకుంటే ఈ స్థాయి 3 కన్నా ఎక్కువగా నమోదైంది. అలాగే మరో 11 రాష్ట్రాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు 1 డిగ్రీ వరకు పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా ఎక్కువ రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అయిన రాష్ట్రాల్లో తెలంగాణ 24వ స్థానంలో ఉంది.