AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌పై పాక్‌ ప్రయోగించిన మీ ఆయుధాలు పనిచేయలేదా? చైనా సమాధానం ఏంటంటే..?

పహల్గామ్‌ ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్రమైన సైనిక ఘర్షణలు జరిగాయి. పాకిస్తాన్ చైనా నుండి కొనుగోలు చేసిన ఆయుధాలను ఉపయోగించిందని భారత్ ఆరోపించింది. చైనా ఈ ఆరోపణలను ఖండించింది. భారతదేశం చైనా తయారీ క్షిపణుల శకలాలను స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలు వచ్చాయి. చైనా ప్రాంతీయ శాంతికి కట్టుబడి ఉందని పేర్కొంది.

భారత్‌పై పాక్‌ ప్రయోగించిన మీ ఆయుధాలు పనిచేయలేదా? చైనా సమాధానం ఏంటంటే..?
China President
SN Pasha
|

Updated on: May 30, 2025 | 4:58 PM

Share

పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్‌ పాక్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య సైనిక చర్యలు కూడా జరిగాయి. ఈ ఘర్షణలో పాకిస్తాన్, భారత్‌పై చైనా, టర్కీ నుంచి కొనుగోలు చేసిన ఆయుధాలను ఉపయోగించింది. పాక్‌ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను భారత రక్షణ వ్యవస్థ కూల్చేసింది. వాటి శకలాలను కూడా పరీక్షించి అవి చైనా తయారు చేసినవిగా గుర్తించారు. అయితే పాక్‌ ఉపయోగించిన చైనా తయారీ ఆయుధాల పనితీరుపై చైనా సమాధానం చెప్పలేకపోయింది. PL-15E, రాడార్-గైడెడ్ బియాండ్-విజువల్-రేంజ్ క్షిపణిని భారత్‌ స్వాధీనం చేసుకున్నట్లు వచ్చిన నివేదికలను తోసిపుచ్చుతూ, చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సీనియర్ కల్నల్ జాంగ్ జియాగోంగ్ మాట్లాడుతూ, “మీరు పేర్కొన్న క్షిపణి ఎగుమతి పరికరం, స్వదేశంలో, విదేశాలలో రక్షణ ప్రదర్శనలలో చాలాసార్లు ప్రదర్శించబడింది” అని అన్నారు.

సైనిక వివాదంలో పాకిస్తాన్‌కు చైనా వైమానిక రక్షణ, ఉపగ్రహ సహాయాన్ని అందించిందని, చైనా ఆయుధ వ్యవస్థలు సగటు కంటే తక్కువగా పనిచేశాయని భారత అధికారులు చేసిన వాదనలపై ప్రశ్నలను ప్రతినిధి తప్పించుకున్నారు. ఇరుపక్షాలు ప్రశాంతంగా, సంయమనంతో ఉండి, పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలను నివారించగలవని మేం ఆశిస్తున్నాం అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ గతంలో చేసిన వాదనలను జాంగ్ గుర్తు చేశారు. మే 7-10 తేదీలలో భారత్‌, పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక వివాదం తర్వాత చైనా రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించిన మొదటి మీడియా సమావేశంలో జాంగ్ మాట్లాడుతూ.. సమగ్రమైన, శాశ్వత కాల్పుల విరమణను సాధించడంలో, ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని కాపాడటంలో చైనా వైపు నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..