ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘పేడ’ కొనుగోళ్లు..కిలో ధర రూ…

పశువుల పేడను రైతులు రకరకాలుగా ఉపయోగిస్తుంటారు. కొందరు పిడకలు చేసి వంట చేసుకోవటానికి వాడుతుంటారు. మరికొందరు పెద్ద మొత్తంలో పేడను సేకరించి పొలాలకు ఎరువుగా వినియోగిస్తుంటారు. ఇంకొన్ని ప్రాంతాల్లో గోబర్ గ్యాస్ వినియోగం కూడా అందుబాటులో ఉంటుంది.

ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘పేడ’ కొనుగోళ్లు..కిలో ధర రూ...
Follow us

|

Updated on: Jul 06, 2020 | 4:59 PM

పశువుల పేడను రైతులు రకరకాలుగా ఉపయోగిస్తుంటారు. కొందరు పిడకలు చేసి వంట చేసుకోవటానికి వాడుతుంటారు. మరికొందరు పెద్ద మొత్తంలో పేడను సేకరించి పొలాలకు ఎరువుగా వినియోగిస్తుంటారు. ఇంకొన్ని ప్రాంతాల్లో గోబర్ గ్యాస్ వినియోగం కూడా అందుబాటులో ఉంటుంది. పశువులు కలిగి ఉన్న రైతుల నుంచి సాగు రైతులు ఎరువును కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వమే పేడ కొనుగోలుకు రంగం చేస్తోంది. సర్కార్ ఆధ్వర్యంలో పేడ కొనటానికి ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం సిద్ధమైంది. పూర్తి వివరాలు పరిశీలించగా…

ఆవు పేడ కొనుగోలు చేసేందుకు చత్తీస్‌గఢ్ ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 25న ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘గోధన్ న్యాయ్’ పథకంలో భాగంగా ఆవు పేడను కొనేందుకు నిర్ణయించుకుంది. రాష్ట్రంలోని రైతులను ఆదుకునేందుకు, పశుసంపద వృద్ధి చేసేందుకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని సర్కార్ భావిస్తోంది. ఈ పథకంలో భాగంగా ప్రజలనుంచి ప్రభుత్వం కిలో ఆవు పేడను రూ.1.5గా నిర్ణయించినట్లు అధికార వర్గాల సమాచారం. జులై 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది.

ఇక పేడ సేకరణ కోసం కూడా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సీఎం భూపేశ్ భాఘేల్ వెల్లడించారు. స్వయం సహాక బృందాల్లోని మహిళలు ఇంటింటికీ వెళ్లి పేడను సేకరిస్తారని, ఇందుకోసం వీరికి ప్రత్యేకంగా ఓ కార్డును జారీ చేయనున్నట్లు తెలిపారు. పేడ కొనుగోలు తేదీని ఆ కార్డులో నమోదు చేస్తారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు గ్రామాల్లో ప్రత్యేకంగా గోధన్ కమిటీలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నగరంలో పురపాలక సంఘాలు, ఇతర అటవీ శాఖ కమిటీల పరిధిలో ఈ పథకం అమలును పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.

సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్