AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhattisgarh Election 2023: రాజస్థాన్ బాటలో ఛత్తీస్‌గఢ్‌.. ఎన్నికల తేదీ మార్చాలంటూ ఈసీకి ఆప్ లేఖ

మరో రాష్ట్రంలో ఎన్నికల తేదీ మార్చాలంటూ డిమాండ్ పెరుగుతోంది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోనూ ఎన్నికల తేదీ మార్చాలంటూ ఫిర్యాదులు అందుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ తేదీని మార్చాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. పండుగలను దృష్టిలో ఉంచుకుని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దీపావళి, లక్ష్మీ-గణేష్ పూజ, ఛత్ పూజ వంటి పండుగలను దృష్టిలో ఉంచుకుని ఛత్తీస్‌గఢ్ ఎన్నికల తేదీని నవంబర్ 17 నుంచి నవంబర్ 25కి మార్చాలని కోరింది.

Chhattisgarh Election 2023: రాజస్థాన్ బాటలో ఛత్తీస్‌గఢ్‌.. ఎన్నికల తేదీ మార్చాలంటూ ఈసీకి ఆప్ లేఖ
Elections
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 18, 2023 | 8:00 PM

మరో రాష్ట్రంలో ఎన్నికల తేదీ మార్చాలంటూ డిమాండ్ పెరుగుతోంది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోనూ ఎన్నికల తేదీ మార్చాలంటూ ఫిర్యాదులు అందుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ తేదీని మార్చాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. పండుగలను దృష్టిలో ఉంచుకుని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దీపావళి, లక్ష్మీ-గణేష్ పూజ, ఛత్ పూజ వంటి పండుగలను దృష్టిలో ఉంచుకుని ఛత్తీస్‌గఢ్ ఎన్నికల తేదీని నవంబర్ 17 నుంచి నవంబర్ 25కి మార్చాలని కోరింది. తద్వారా ఓట్ల శాతం పెరిగేలా చూడాలని ఆప్ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన కొద్ది రోజులకే రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని మార్చింది కేంద్ర ఎన్నికల సంఘం. నవంబర్‌ 23 బదులు నవంబర్‌ 25న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగుతుందని తెలిపింది. అయితే డిసెంబర్‌ 3న కౌంటింగ్‌ యథాతథంగా ఉంటుంది. నవంబర్‌ 23న రాష్ట్రవ్యాప్తంగా చాలా పెళ్లిళ్లు ఉన్నాయని , పోలింగ్‌ తేదీని మార్చాలని రాజకీయ పార్టీలతో పాటు చాలా మీడియా సంస్థలు ఈసీకి విజ్ఞప్తి చేశాయి. దీంతో ఎన్నికల షెడ్యూల్‌ను మారుస్తునట్టు ఈసీ ప్రకటించింది.

ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం పాత్రలో బీజేపీ ఉంది. రాష్ట్రంలో గత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 15 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ 68 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేజిక్కించుకుంది. అదే సమయంలో ఈ ఎన్నికల్లో బీజేపీకి 15 సీట్లు వచ్చాయి.

ఇదిలావుంటే ఢిల్లీ, పంజాబ్‌లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలోనే జాతీయ పార్టీగా అవతరించిన ఆప్.. గత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసింది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌తో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆప్ పోటీ చేయాలని భావిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంది. మరోవైపు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ రెండూ జాతీయ స్థాయిలో భారత కూటమిలో భాగంగా కొనసాగుతున్నాయి. అయితే మూడు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు లేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

అప్పట్లో ఊపేసిన శాంతా భాయ్ గుర్తుందా.?
అప్పట్లో ఊపేసిన శాంతా భాయ్ గుర్తుందా.?
సారాతో బ్రేకప్ పుకార్లు.. ఎట్టకేలకు మౌనం వీడిన గిల్.. ఏమన్నాడంటే?
సారాతో బ్రేకప్ పుకార్లు.. ఎట్టకేలకు మౌనం వీడిన గిల్.. ఏమన్నాడంటే?
దారులన్నీ ఓరుగల్లు వైపే.. కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ..
దారులన్నీ ఓరుగల్లు వైపే.. కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ..
ఉత్తమ స్త్రీ లక్షణాలు ఇవే.. వీరుకుటుంబానికి దిశానిర్దేశం చేస్తారట
ఉత్తమ స్త్రీ లక్షణాలు ఇవే.. వీరుకుటుంబానికి దిశానిర్దేశం చేస్తారట
చెల్లికి ఆస్తిలో వాటా ఇచ్చారనీ.. తల్లిదండ్రులను చంపిన కొడుకు..!
చెల్లికి ఆస్తిలో వాటా ఇచ్చారనీ.. తల్లిదండ్రులను చంపిన కొడుకు..!
ముంబైతో లక్నో.. ఢిల్లీతో బెంగళూరు.. సూపర్ సండేలో హోరాహోరీ పక్కా
ముంబైతో లక్నో.. ఢిల్లీతో బెంగళూరు.. సూపర్ సండేలో హోరాహోరీ పక్కా
శ్రీవారి భక్తులకు ప్రసాదం విక్రయం మొదలు పెట్టారో తెలుసా..
శ్రీవారి భక్తులకు ప్రసాదం విక్రయం మొదలు పెట్టారో తెలుసా..
రేపట్నుంచి RRB రాతపరీక్షలు షురూ..హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ లింక్ ఇదే
రేపట్నుంచి RRB రాతపరీక్షలు షురూ..హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ లింక్ ఇదే
నేటి మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణం చదవాలి.. ఎందుకంటే
నేటి మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణం చదవాలి.. ఎందుకంటే
అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో బంగారం తులం ధర ఎంత ఉందంటే..
అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో బంగారం తులం ధర ఎంత ఉందంటే..