Paralytic Deaths: మరో మహమ్మారిలా పక్షవాతం..? ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే..!
పక్షవాతం మరో మహమ్మారిలా మారనుందా అంటే అవుననే అనిపిస్తోంది. పక్షవాతంతో మరణించేవారి సంఖ్య ప్రతిఏటా పెరుగుతూ వస్తోందంటున్నాయి నివేదికలు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది మరింత పెరగవచ్చంటున్నారు నిపుణులు. పక్షవాతంతో మరణించేవారి సంఖ్య 2050 నాటికి కోటికి చేరుతుందని ప్రముఖ వైద్య పరిశోధన సంస్థ ద లాన్సెట్ అంచనా వేసింది. ఈ వ్యాధి కారణంగా ఏడాదికి 2.3 లక్షల కోట్ల డాలర్లు ఖర్చవుతాయని వెల్లడించింది.
పక్షవాతం మరో మహమ్మారిలా మారనుందా అంటే అవుననే అనిపిస్తోంది. పక్షవాతంతో మరణించేవారి సంఖ్య ప్రతిఏటా పెరుగుతూ వస్తోందంటున్నాయి నివేదికలు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది మరింత పెరగవచ్చంటున్నారు నిపుణులు. పక్షవాతంతో మరణించేవారి సంఖ్య 2050 నాటికి కోటికి చేరుతుందని ప్రముఖ వైద్య పరిశోధన సంస్థ ద లాన్సెట్ అంచనా వేసింది. ఈ వ్యాధి కారణంగా ఏడాదికి 2.3 లక్షల కోట్ల డాలర్లు ఖర్చవుతాయని వెల్లడించింది. తక్కువ, మధ్య ఆదాయం కలిగిన దేశాల్లోనే ఈ మరణాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. 2020లో పక్షవాతంతో చనిపోయినవారి సంఖ్య 66 లక్షలుగా ఉందని తెలిపింది. గత 30 ఏళ్లలో పక్షవాతంతో మరణించడం లేదా వైకల్యం బారినపడే వారి సంఖ్య రెట్టింపు అయ్యిందని ఈ నివేదికలో వివరించింది. 2020లో పక్షవాత మరణాలు అత్యధికంగా ఆసియాలో 61 శాతం ఉండగా.. 2050 నాటికి 69 శాతానికి పెరుగుతాయని తెలిపింది. ఈ మరణాల నివారణకు ప్రజల్లో విస్తృత ప్రచారాన్ని కల్పించాలని పేర్కొంది. ఇందుకోసం డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకుని శిక్షణ, అవగాహన కార్యక్రమాలు రూపొందించాలని తెలిపింది. ఈ మరణాలను ఎదుర్కోవడానికి సరిపడా వైద్య సిబ్బంది, మందులు, మౌలిక సదుపాయాలను పెంచాలని స్పష్టం చేసింది. సరైన జాగ్రత్తలు, చికిత్స తీసుకుంటే పక్షవాత బాధితుల్లో అకాల మరణాలను తగ్గించవచ్చని వివరించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..