దేశంలో కరోనా మహమ్మారి అత్యంత వేగంగా వ్యాపించిన విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా వ్యాపిస్తున్న ఈ మహమ్మారికి ఎంతో మంది బలయ్యారు. చాలా మంది కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత కూడా తీవ్ర అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. కరోనా తర్వాత దాని వేరియంట్లు రకరకాలుగా పుట్టుకొస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్‌తో వ్యాపిస్తున్న వైరస్.. మరిన్ని వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన BF.7 లక్షణాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ వేరియంట్ వ్యాపించిన వారికి ఛాతీ నొప్పి, వాసన కోల్పోవడం, వినికిడి సమస్యతో పాటు ఎన్నో రకాల లక్షణాలు ఉన్నాయి. BF.7 సబ్-వేరియంట్ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్, UK, ఆస్ట్రేలియా, బెల్జియం, ఇతర ప్రాంతాలకు చేరుకుంది. అలాగే చైనాలోని మంగోలియా ప్రాంతం నుండి ఉద్భవించిన తర్వాత మరిన్ని ప్రాంతాలకు వ్యాపిస్తోంది.
చైనాలో ఇటీవల కోవిడ్-19 కేసుల పెరుగుదల వెనుక ఒమిక్రాన్ వేరియంట్ BF.7 ఉందని నివేదికలు చెబుతున్నాయి. రాబోయే పండుగల సీజన్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. కొత్త వేరియంట్ షాలిమార్ బాగ్‌లోని మ్యాక్స్ హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ ధాల్ మాట్లాడుతూ, ఓమిక్రాన్ BF.7 గురించి గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరికలు జారీ చేసింది.
BF.7 వేరియంట్‌లో ఇన్‌ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉందని చెప్పారు. దీని వల్ల మనిషిలో నిగనిరోధక శక్తి తగ్గుతుందని అన్నారు. ఈ వేరియంట్ లక్షణాలు తీవ్రంగా ఉండకపోయినా.. తెలికపాటి లక్షణాలు ఉంటాయన్నారు. కానీ ఇతర అనారోగ్యాలు ఉన్న రోగులలో గుండె జబ్బులు, మూత్రపిండ వ్యాధి లేదా కాలేయ వ్యాధి, వృద్ధాప్య రోగులపై చాలా ప్రభావం చూపుతుందన్నారు. ఇలాంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
– నిరంతర దగ్గు
– వినికిడిలో ఇబ్బంది
– శరీరంలో వణుకు రావడం
– వాసన కోల్పోవడం
అయితే కరోనా తగ్గుముఖం పట్టినా.. కొత్త వేరియంట్ల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటిస్తూ చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. తప్పనిసరిగ్గా మాస్క్ ధరించాలంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి