Memes on chennai rains: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో చెన్నై, దాని శివారు జిల్లాల్లో కొద్దిరోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. 2015 తర్వాత ఆ స్థాయిని గుర్తుకు తెచ్చేలా కురిసిన వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూర్ జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు రోజులు సెలవు ప్రకటించారు. తమిళనాడులో అక్టోబరు ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు సాధారణం కంటే 43 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆదివారం నుంచి చెన్నైలో దాదాపు 10 సెంటీమీటర్లకు పైగానే వర్షం కురుస్తోంది. భారీ వర్షాలు కురుస్తుంటడంతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే నిన్నటినుంచి ట్విటర్‌లో #ChennaiRain ట్రెండింగ్‌లో ఉంది. కాగా.. ఆఫీస్‌కు ఈదుకుంటూ వెళ్లడం ఒక్కటే మార్గం, మా వీధిలో నది.. మా ఇంట్లో సరస్సు లాంటి మీమ్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
చెన్నైలో వర్షాలు ప్రారంభం నాటినుంచి సహాయం, సమాచారం అభ్యర్థనలతో పాటు.. మీమ్స్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సప్, తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై గతంలో పరిస్థితి.. ఇప్పటి పరిస్థితిని పోల్చుతూ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. చెన్నైలోని టీ నగర్ ప్రాంతంలో గతంలో వరదలు వచ్చినప్పుడు నాయకుల పర్యటనలు.. వాగ్ధానాలను.. అదేవిధంగా ఇప్పటి నాయకుల పర్యటనలను పోల్చుతూ.. మీమ్స్ చేస్తున్నారు.
వరదలు, కరెంట్ కోతలు, తదితర సమస్యల నేపథ్యంలో.. కామెడీ చిత్రాలను పంచుకుంటూ విమర్శలను వెళ్లగక్కుతున్నారు. చెన్నైలో ప్రతీ ఏడాది ఇదే పరిస్థితి నెలకొంటుందని.. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనాలంటూ వేడుకుంటున్నారు.
#WATCH Waterlogging persists in Korattur area following heavy rainfall in #Chennai #TamilNadu pic.twitter.com/xN3tEwquAh
— ANI (@ANI) November 12, 2021
Also Read: