Chennai: చెన్నై విమానాశ్రయంలో పురాతన శివలింగం స్మగ్లింగ్.. అప్రమత్తమైన అధికారులు.. చివరికి
చెన్నై విమానాశ్రయంలో క్రీ.శ.1800 సంవత్సర కాలానికి చెందిన నాగాభరణంతో కూడిన పురాతన శివలింగాన్ని(Shivalingam) కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. చెన్నై(Chennai) ఎయిర్ పోర్టు నుంచి అమెరికాకు తీసుకెళ్తుండగా....
చెన్నై విమానాశ్రయంలో క్రీ.శ.1800 సంవత్సర కాలానికి చెందిన నాగాభరణంతో కూడిన పురాతన శివలింగాన్ని(Shivalingam) కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. చెన్నై(Chennai) ఎయిర్ పోర్టు నుంచి అమెరికాకు తీసుకెళ్తుండగా అధికారులు చెకింగ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో శివలింగం విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. విగ్రహం వివరాలు ఆరా తీయగా తమిళనాడు లోని కుంభకోణం(Kumbakonam) లో కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. ఈ విగ్రహం 4.56 కిలోల బరువు, 36 సెంటీమీటర్ల ఎత్తు ఉంది. కస్టమ్స్ అధికారులు ఏఎస్ఐ నిపుణుల బృందాన్ని సంప్రదించారు. వారు విగ్రహాన్ని పరిశీలించి.. ఇది 1800 ల ప్రారంభంలో ఉన్న పురాతన వస్తువుగా ధృవీకరించారు. కస్టమ్స్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద విగ్రహంతో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Also Read
Junior Hockey World Cup: అద్భుత ప్రదర్శనతో సెమీస్ చేరిన భారత మహిళలు.. దక్షిణ కొరియాపై భారీ విజయం..
Crime news: దత్త పుత్రికపై రెండేళ్లుగా అత్యాచారం.. తండ్రి, సోదరుల ఘాతుకం.. అసలేం జరిగిందంటే