AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India – Ukraine: అలాంటి దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.. కైవ్ హత్యలపై స్వతంత్ర దర్యాప్తునకు భారత్

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యా(Russia) కు వ్యతిరేకంగా ఓటింగ్‌కు దూరంగా ఉన్న భారత్.. ఉక్రెయిన్‌లోని బుచాలో జరిగిన పౌర హత్యలను తీవ్రంగా ఖండించింది. కైవ్ శివారులో జరిగిన ఘోర హత్యలపై స్వతంత్ర దర్యాప్తునకు భారతదేశం మద్దతు ఇచ్చింది....

India - Ukraine: అలాంటి దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.. కైవ్ హత్యలపై స్వతంత్ర దర్యాప్తునకు భారత్
Tirumurthi
Ganesh Mudavath
|

Updated on: Apr 08, 2022 | 4:26 PM

Share

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యా(Russia) కు వ్యతిరేకంగా ఓటింగ్‌కు దూరంగా ఉన్న భారత్.. ఉక్రెయిన్‌లోని బుచాలో జరిగిన పౌర హత్యలను తీవ్రంగా ఖండించింది. కైవ్ శివారులో జరిగిన ఘోర హత్యలపై స్వతంత్ర దర్యాప్తునకు భారతదేశం మద్దతు ఇచ్చింది. బుచా(Bucha) లో పౌర హత్యల గురించి ఇటీవలి నివేదికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని భద్రతా మండలిలో ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి టీఎస్.తిరుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఈ హత్యలను ఖండిస్తున్నామని వెల్లడించారు. అంతే కాకుండా స్వతంత్ర దర్యాప్తు(Investigation) కోసం మద్దతిచ్చామని తెలిపారు. ఫలితంగా మానవతా పరిణామాలు, అంతర్జాతీయ సమాజం, మానవతా అవసరాలకు సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లోని భయంకరమైన మానవతావాద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఉక్రెయిన్, ఉక్రెయిన్ పొరుగు దేశాలకు ఔషధాలు, ఇతర అవసరమైన సహాయ సామగ్రిని అందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

ఉక్రెయిన్‌ ఎగుమతులు, దిగుమతుల్లో 70% నల్లసముద్రం మీదుగా నౌకా రవాణా ద్వారానే జరుగుతోంది. ఇందులో సగం వాణిజ్యం ఒడెసా రేవు కేంద్రంగానే సాగుతోంది. అందుకే రష్యా ఈ ప్రాంతంపై పట్టుకోసం భీకరంగా దాడులు చేస్తోంది. ఇప్పటికే పలు రేవులపై పట్టు సాధించిన మాస్కో సేనలు ఒడెసాను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. అదే జరిగితే, ఉక్రెయిన్‌ తన సముద్రతీర ప్రాంతాన్ని పూర్తిగా కోల్పోతుంది. వాణిజ్య పరంగా భారీ నష్టం చవిచూడాల్సి వస్తుంది. అందుకే… కీవ్‌ను రక్షించుకోవడానికి ఆ దేశం ఎంతగా పోరాడుతోందో, ఒడెసా రేవుపై పట్టు నిలుపుకొనేందుకూ అంతే శ్రమిస్తోంది.

Also Read

మొబైల్ ఫోన్ వెలుతురులో ప్రసవాలు రాష్ట్రంలో దుస్థితిని తెలియచేస్తున్నాయి.. జనసేనాని పవన్ తీవ్ర ఆగ్రహం

Viral: కోటి ఆశలతో కొత్త జీవితంలోకి.. తొలి రాత్రి వధువు చెప్పిన నిజంతో అంతా కొలాప్స్

ఎగిసిపడుతున్న సముద్రపు అలల తాకిడిలో అందాల ముద్దుగుమ్మ క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్..